సాయి వచనాలు


*"నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు"*

- దీక్షిత్ డైరీ


*"బాబాతో అనుబంధం పెంచుకోవాలంటే ఆయన చేసిన పనులు తెలుసుకోవాలి. అవి ఆయన చరిత్ర చదివితే తెలుస్తాయి. ఆయన తత్వం అర్థం చేసుకోవడానికి, ఆయన ఎలాంటి వారు? మనను ఉద్ధరిస్తారా, లేదా అన్న పద్ధతిలో చరిత్రను విశ్లేషణాత్మకంగా చదవాలి. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? ఏం చెప్పారాయన? ఒక లీల జరిగినపుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను? ఇలా ప్రతి విషయం గురించి తరచి చూసుకుంటూ, ఒక్క లీల చదివినా చాలు! నిజానికి ఆ యింట్రస్ట్ వుంటే ఒక్క లీలతో ఆపము. నవల చదివినట్లుగా బాబా చరిత్ర చదువుగల్గుతాము. అలా బాబా చరిత్ర అవగాహనతో చదవడం వలన ఆనందం, తృప్తి కలుగుతాయి"*

- శ్రీబాబూజీ

ఈ రోజు సాయి మాట
సాయితో మనం
అమృత వాక్కులు
శ్రి సాయి సచ్చరిత్రము- పారాయణ ఆడియో
శ్రీ సాయి వీడియోలు
సాయి పలుకులు
సాయి వచనాలు
షిరిడి సమాచారము

నారా కురుపుతో బాధ పడుతున్న బాబాగారి భక్తుడు డాక్టర్ పిల్లే. 7 కురుపులతో తన కాలి పైన బాధ పడుతున్నాడు. ఆ భక్తుడు ఆ యాతన కన్నా మరణమే మేలను కున్నాడు. కానీ సాయికి శరణు వేడాడు. తన బాధను తరువాతి 10 జన్మలలో అనుభవిస్తానని సాయిని వేడాడు. బాబాగారు వానితో చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ద్వంద్వాలు (ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖాలు) సంచిత కర్మానుసారం ప్రవాహంవలె వచ్చిపడతాయి. వాటికి ఆనందిచకూడదు, దుఃఖం కూడదు. అంటూనే బాబాగారు పిల్లే కాలిపైన అబ్దుల్లా కాలు పడేటట్లు తద్వారా పిల్లెకి ఉపశమనం కలిగించారు సాయిబాబా గారు. దీన్నిబట్టి కర్మను తప్పించలేము అనే నిజాన్ని సాయి గుర్తుచేస్తూ కానీ సద్గురువుని నమ్మిన భక్తులకు సత్గురువే కర్మను కూడా తప్పించే శక్తి కూడా కలదని అంతరార్థం ఇందు చూపినారు మన సత్గురు సాయినాథుడు.


*దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.*


*దేవుడు సత్యం, బ్రహ్మానందం, సౌందర్యం.*

*దైవాన్ని ప్రేమించటం జీవిత లక్ష్యం*

*దైవంతో ఐక్యం చెందటం జీవిత గమ్యం.*

*దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వారే అందరినీ మించిన అదృష్టవంతులు*

*వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం కూడా అశాశ్వతమే.*

*మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలో ఉన్నది అని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి.*

ఈ సంసారమనే మాయలొంచి తరించాలి అంటే ....
దైవ ప్రార్థన చేయడం తప్ప మరో మార్గం లేదు..
దైవ స్మరణను చేయలేకపోయినా చేసినవారిని చూసి వారు పాటించే స్త్రోత్రాన్ని విన్నా సరే భాగవధనుగ్రహం కలిగి,ఆ మాయను తరించి ముందుకు వెళతారు...
ఇతరుల గొప్పదనం గురించి,
ఔన్నత్యం గురించి ఈర్ష పడని వారే
నిత్యం ఆనందంగా ఉండగలరు.

అందరికి దేవుడే మార్గదర్శకుడు....
అణువణువు నిండి ఉండి, మనలోపలా,మన వెలుపలా సంచరిస్తూ కూడా మనతో పలకడు,కనిపించడు.
దానికై నీవు చింతించాలి కానీ,....
ఏదో రోజున శాశ్వతంగా కంపించకుండా పోయే వాటికోసం ఎందుకీ యాతన....

ఈ బంధాలు మాయ...
బంధవ్యాలు మాయ...
భగవంతుడు ఒక్కడే సత్యం...
అందరికి భగవంతుడే కర్త కర్మ ....

*'సబ్ కా మాలిక్ ఎక్'*

సాయిరామా!!!

విలువలేని చోట వివేకము పనికిరాదు.మౌనమే మంచి ఆలోచనలను కలిగించును..అవసరానికి మించిన ఆలోచనలు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వవు.నిన్ను నిన్నుగా నిలిపేది నీ వ్యక్తిత్వమే..ఓర్పుకు మించిన ఆయుధము లేదు..ఇతరుల మంచి కోరు భగవంతుడు నీకు మంచి చేస్తాడు.సాయి చూపిన బాట.. సాయి చెప్పిన మాట ఒకటే శ్రద్ద, సబూరి.. ఇవి పాటించిన వారు ఎన్నటికీ ఓడిపోరు..

ఓంసాయి!శ్రీ సాయి!జయ జయ సాయి!


సాయి మార్గంలో నడిచే వారు తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి వారికి సామాన్యంగా, సహజంగా మనోనాశనం అవుతుంది.
శరీరం యొక్క చావు పుట్టుకలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. శరీరాన్ని ఏమీ పట్టించుకోరు. దానికి ఏదైనా రోగం వస్తే వైద్యం చేయించుకోవడం. లోపల మీ జీవుడిని బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చే కష్ట సుఖాలకు మీ మనస్సే కారణం.
చనిపోయాకా ఇతర లోకాలకు ప్రయాణం చేసేది మనస్సే ( జీవుడే ). కొత్త శరీరాన్ని తొడుక్కొనేది జీవుడే. మీరు ఏదిగా ఉన్నారో, ఆ సద్వస్తువు ప్రయాణం అంటే (మన శరీరం ప్రయాణం) చెయ్యదు.
ముందుగా మనస్సును అంటే, జీవుడిని బాగు చేసుకోండి. జీవ లక్షణాలను పోగొట్టుకోవాలి,
అదే నిజమైన సంపద. జీవుడిని బాగు చేసుకోవటం ఎలాగ ? దానికి సంబంధించిన సాధన, మెలుకువలు చెప్పిన గ్రంథం శ్రీ సాయి సత్చరిత్ర.
మనకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉండాలి. అజ్ఞాని ఇంద్రియాలు చెప్పినట్లుగా వినాలి. అలా వినకపోతే అవి ఊరుకోవు. జ్ఞాని చెప్పినట్లుగా ఇంద్రియాలు ఉంటాయి. అదీ అజ్ఞానికీ, జ్ఞానికీ ఉన్న తేడా.

*_ఓం శ్రీ సద్గురు సాయినాథయా నమః_*
*_అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*_ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి_*

*_నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*


`నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను.

ఏ సాధనలుగాని ఆరు శాస్త్రములలో ప్రావీణ్యముగాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము నుంచుము.

గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహరబ్రహ్మల (త్రిమూర్తుల) అవతారమని యెంచెదరో వారే ధన్యులు."
``
*_ఓం శ్రీ సాయి నాథయా నమః_*
*_ఓం శ్రీ సద్గురు సాయినాథయా నమః_*
*_అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*_ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి_*

*_నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*


*"తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. వాని పిల్లలు మరొక తీరాన ఉంటాయి. వానికి పాలుగాని వెచ్చదనం గాని ఉండవు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి. పిల్లలు ఎప్పుడు తల్లినే ధ్యానిస్తుంటాయి అంతే. వాటికి ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. పాలుగాని వేరే ఆహారం గాని అవసరం లేదు. తల్లి చూపులే వానికి పోషణ. ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి. అట్లే గురుశిష్యులలో ఐక్యతా సృష్టి"*

- శ్రీసాయి సచ్చరిత్ర (అధ్యాయం 19)


? సయిబాబాగారు వి.హెచ్.ఠాకూర్ తో ఇలా అన్నారు "ఈ ఆధ్యాత్మమార్గం మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరం. ఇచ్చటి మార్గం అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నీవు వచ్చిన దారిలో ఎనుబోతు పైన సవారీ చేయుటకంటె కష్టం! "

? ఠకూర్ బాబాగారి వద్ద రాక ముందు, వడగామ్ అను పట్టణమున ఒక కన్నడ యోగి ఐన "అప్ప " అనే అతనిని దర్శించినప్పుడు అతనిని ఆ యోగి "విచారసాగర " అనే వేదాంత గ్రంథమును చదవమని, ముందు ముందు ఒక గొప్ప మహాత్ముడుని (సాయిబాబాను ) కలుస్తాడని ఆ యోగి ఠాకూర్ తో చెప్పెను.

? అది జరిగిన కొన్ని రోజులకే ఠాకూర్కు జున్నరుకు బదలీ అవ్వడం, దారిలో లోయలు దాటుటకు ఎనుబోతు ఎక్కడం, అది చాలా బాధ కలగడం, తరువాత శిరిడీలో బాబాగారిని కలిసినపుడు సాయిబాబా గారు పైన చెప్పినట్లు ఠాకూర్తో అనడం జరిగినది.

? ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టమైనదని బాబాగారు ముందే సూచించారు.

? వచారసాగరం అనే పుస్తకం వేదాంతంకు సంబందించినది. అది ఆద్యాత్మికం గురించి చెప్పబడినది. బాబాగారి ఉద్దేశం అభ్యసించినది ఆచరణలో పెట్టాలని మరియు ఊరకే గ్రంధములు చదువుట వలన ఉపయోగం లేదని బాబాగారి ఉద్దేశం. చదివినది విచారణ చేసిన పిదప ఆచరణలో పెట్టవలెనని సాయిబాబాగారి సందేశం.

? దనికి తోడుగా గురువు గారి అనుగ్రహంకూడా తోడుగా ఉంటేనే జరుగుతుందన్నారు బాబా.

? హజీ సిద్దీఖ్ ఫాల్కె అనే మరొక భక్తుడు మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట శిరిడీ చేరినపుడు, బాబాగారు అతనిని 9 నెలల వరకు మసీదులో పాదం పెట్టనివ్వలేదు. కారణం అల్లా కటాక్షం లేదని. పైన చెప్పినట్లుగా గురువుగారి అనుగ్రహం తోడుగా ఉండాలి అని, గురువు, భగవంతుడు ఒక్కరే. వీరిరువురికి బేధం చూసినవారికి దేవుడిని ఎక్కడా చూడలేరు. హాజీకి ఆధ్యాత్మిక మార్గం ప్రవేశానికి సమయం రాన్నందున బహుశా బాబాగారు అతనిని 9 నెలల వరకు కాలు మోపనీయలేదు. ఆచరణ లేకపోవుట కారణం అయివుండవచ్చు

? హజీ కి ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టమైనదనే ఉద్దేశ్యంతో, అది ఎలాంటి కష్టం అంటే బాబాగారు చెప్పదలచి శ్యామాను పిలిచి ఇలా అన్నారు " బారావీ బావి వద్ద నున్న ఇరుకు కాలిబాటకు వస్తాడా అని, నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడా అని, మసీదులో మేకను కోసెదమని దాని మాంసము కావలెనో, లేదా దాని వృషణములు కావలెనో కనుగొనమని చెప్పెను. వీటన్నిటి కన్నా చాలా కష్టమైనదని బాబాగారి ఉద్దేశ్యం.

? ఠకూర్ని కూడా బాబాగారు ఎనుబోతు పైన సవారీ కన్నా కష్టమైనది అని పైన చెప్పినట్టు సూచించారు.

? కవున ఆధ్యాత్మిక మార్గం అనుకునేంత తేలిక ఐనది కాదు. ఎంతో కృషి చేయాలి.ఎనుబోతు పై ఎక్కుట, బావి వద్ద ఇరుకు కాలిబాటకు నడచుట, నలుబదివేలు నాలుగు వాయిదాలలో ఇచ్చుట, మేక వృషణములైన కోరుట ఇటువంటి వైన కష్టంతో సాదించవచ్చునేమో గాని, ఆధ్యాత్మిక మార్గం వీటన్నిటి కన్నా కష్టతరం.కానీ గురువును నమ్మిన వారి విషయం వేరు. వారికి గురువు తోడుగా ఉండి కఠినమైన ముళ్ల మార్గం, పూల మార్గంగా మారుతుంది.గురువును నమ్మి, అన్ని వారికి వదలి ఏ విషయం ఐనను లేదా చదివిన విషయమును జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. అన్నిటి కన్నా ముఖ్యం గురువు గారి అనుగ్రహం.

? ఆధ్యాత్మిక మార్గం లో వెళ్ళాలి అనుకున్నవారు బాబాగారిని పట్టుకోవాలి. సాయిబాబాగారే రక్ష, మార్గదర్శకులు. వారి చరితమే మార్గం. శ్రీ సాయి సత్చరితమును పఠించి, చదివిన దానిని మననం చేసి, దానిని ఆచరణలో పెట్టాలి. అడుగడుగునా ఆధ్యాత్మిక మార్గం నందు సాయిబాబాగారిని కొలుచుకుంటూ అనుగ్రహం సంపాదిస్తేనే ముందుకు నడువగలం.లేనిచో అగాధమే...

....................... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్.

భగవన్నామ స్మరణ చేసేటపుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి. నామమునకు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామము పలుకుతూ మనసులో ఏవో ఆలోచనలు చేస్తుంటే అది స్మరణ అనిపించుకోదు. ఇలా ఎంత సమయం చేసినప్పటికీ ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. రేడియో ఉంటుంది చూడండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రమున ఆ పాటలకు భగవంతుడు కదలి వస్తాడా!? మనం నేడు రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరములకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగా ఉన్నపుడే ఆయన పలుకుతాడు. ప్రార్థనకు సమాధానమిస్తాడు.


_నీవు ఏపని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్లు విసురుతునే వుంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటిని నీ గెలుపు బాటగానూ ఉపయోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది._

శరీ సాయి సత్చరిత్రములో మన ప్రయత్నము నందు జయము కలుగవలెనన్న ఉపాయం చెప్పబడినది, అదే సాయినాథుని పాదములను నమ్మి పట్టుకోవడమే. వట్టి పట్టుకున్నామని అనుకున్న లాభం లేదు కారణం మన అహంకారం. మన అహంకారాన్ని కూడా బాబా పాదముల వద్ద సమర్పించాలి. శరణు కోరాలి. అప్పుడే మన ప్రయత్నములన్ని జయం.

? అలాగే తమ క్షేమము కోరుకొనే వారు, గౌరవముతోను మరియు ఆదరణతోనూ బాబాగారి లీలలను వినాలి, అవి బాగ మననం చేయాలి. ఇట్లు చేసినవారికి, వారు సులభముగా జీవిత పరమావధిని తప్పక పొందెదరు. అది మోక్షానికి కూడా దారి తీస్తుంది.

? ఎటువంటి దాపరికము లేదా రహస్యములు లేనిది శ్రీ సాయి సత్చరిత్ర. అందరికి ఓపెన్ గా ఉండి ఎవరైనా మననం చేసి ఆచరిస్తే చాలు ఇక చెప్పనక్కర్లేదు. సాయి సంపూర్ణ అనుగ్రహమే.

? బబాగారి చెప్పినముఖ్యమైన విషయాలలో "నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేను నీ చెంత లేనా? తినుటకు ముందు నాకు అర్పిస్తున్నావా? " అని హేమాడ్పంత్ తో అన్నప్పటికీ అది మనందరికీ వర్తిస్తుంది.

? బబా సూటిగా పైన చెప్పిన దానిలో నమ్ముకున్న వారి చెంత సాయిబాబాగారు తప్పకుండ వారిచెంతనే ఉంటారని సూచిస్తూ, కావుననే స్మరించమని, తినేది అర్పించమని బాబాగారు సూచిస్తున్నారు.

? మన పంచేంద్రియములు విషయములను విడిచి ఎప్పుడుకూడా వేరుగా వుండవు. విషయములను చూస్తే (కన్ను ద్వారా -పంచేంద్రియములలో ఒకటైన కన్ను ) ఆనందమును అనుభవించును.

? అడ్డు ఇక్కడ విషయములని అర్ధం అవుతున్నది. కావున ఏమి చేయాలి? మొదటే ఆ విషయములను సాయిబాబా గారికే అర్పించాలి. అప్పుడు విషయానందములను అనుభవించే మన మనస్సు మరియు బుద్ది స్థిర పడును. అభిమానం పోవును.

?ఇలా చేసినవారికి అనగా మన అరిషడ్వార్గాలు ఎప్పుడైతే బాబాగారికి అర్పించామో మరియు మన విషయములను అనుభవించు ముందు బాబాగారు మన చెంతనే వున్నారు (పైన బాబాగారు చెప్పినట్లు ) అనుకున్న, అట్టి సందర్భంలో బాబాగారు ఆ విషయ వస్తువు అనుభవించదగినదా? లేదా? అనే ప్రశ్న మనకు సూచించి అనుభవించుటకు తగదో అట్టి దానిని విడిచిపెట్టెదము. ఫలిత మన దుర్గుణములన్ని పోవును.

? సయిబాబాగారిని స్మరించనిదే ఏ వస్తువును మన పంచేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి...... వీటితో అనుభవించరాదని, అలా స్మరించుటచేత బాబాగారిని ఎల్లప్పుడు గుర్తుంచుకొందుమని ఫలితంగా ధ్యానము మరియు సాయి సగుణ స్వరూపం మన కండ్ల ముందే ఉండి భక్తి, వైరాగ్యం మరియు మోక్షం మన వశం అవుతుంది.

? కవున బాబాగారు అందుకే నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవు నాకు అర్పించుచున్నావా? అని అన్నారు..

............ కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార