సాయి పలుకులు

నా నామమును ప్రేమతో యుఛ్చరించిన వారి కోరికలన్నియు నెరవేర్చెదను.
వాని భక్తిని హెచ్చించెదను.
వాని నన్ని దిశలందు కాపాడెదను.
ఏ భక్తులయితే మనః పూర్వకముగా నాపై యాధరపడి యున్నారో వారలు నా కధలు విను నప్పుడు మిక్కిలి సంతసించెదరు.

నా లీలలను పాడువారికి యంతులేని యానందమును, శాశ్వతమైన తృప్తియు యిచ్చెదనని నమ్ము .
ఎవరయితే సర్వస్యశరణాగతి వేడెదరో..
నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో..
నన్నే స్మరించెదరో..
నా యాకారమును మనస్సున నిలిపెదరో..
వారిని బంధనముల నుండి తప్పించుట..
నా ముఖ్య నైజము.

ప్రపంచములోని వాటినన్నిటిని మరచెదరు.
నా నామమునే జపించుచు..
నా పూజనే సల్పుచు..
నా కధలను జీవితమునే మననము చేయుచు.. యెల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచు కొనువారు..
ప్రపంచ విషయములందు యెట్లు చైతన్య ముంచగలరు. వారిని మరణము నుంచి బయటకు లాగెదను.

నా కధలే వినినచో సకల రోగములు నివారించును.
కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కధలను వినుము.
వానిని మనమున నాటింపుము.
ఆనందమునకు, తృప్తికి యిదియే మార్గము.
నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును.
వినువారికి శాంతి కలుగును.
మనఃపూర్వక నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యము కలుగును.
సాయిసాయి యను నామమును జ్ఞప్తి యందుంచు కొన్నంత మాత్రమున పలుకుట వలన..వినుట వలన వచ్చు పాపములను తొలగించును..

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

ఈ రోజు సాయి మాట
సాయితో మనం
అమృత వాక్కులు
శ్రి సాయి సచ్చరిత్రము- పారాయణ ఆడియో
శ్రీ సాయి వీడియోలు
సాయి పలుకులు
సాయి వచనాలు
షిరిడి సమాచారము

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార