సాయిభక్తుడైన దాసగణు మహరాజ్ ఉల్లిపాయ

సాయిభక్తుడైన దాసగణు మహరాజ్ ఉల్లిపాయ అంటే అస్యహించుకొనేవాడు .ఒకసారి సాయబాబా దాసగణు ని ఉల్లిపాయ మసాలా తయారుచేసి ,కొంత తిని మిగిలింది తీసుకు రమ్మని అన్నాడు .ఏలాగో ఉల్లిపాయలు తెచ్చి ,మసాలా తయారుచేసాడు దాసగణు .దానిని వేలికొనలతో తాకి ,ఆ వేలిని పెదవికి తాకించుకొని తినినట్లు భావన చేసుకుని ,నోరు శుభ్రం చేసుకుని ఉల్లిమసాలా తీసుకునిద్వారకామాయి కి వెళ్లి సాయిబాబాకి సమర్పించాడు ." నీవు తిన్నావా ?అని బాబా ప్రశ్నించాడు ." తిన్నాను " అని సమధానమిచ్చాడు దాసగణు .అది విన్న బాబా ఆక్కడివారితో ," ఈ దాసగణు నటిస్తున్నాడు .వేళ్ళతో పెదవులను ఉల్లిని తాకాడు ".అని దాసగణు తన నివాసంలో ఎలా చేసాడో ఆలాగే చేసి చూపాడు సాయబాబా .దాసగణు బిక్కచచ్చిపోయాడు .అసలు బాబా తన నివాసంలో చేస్తున్నట్లు చూసి చెప్పాడే ? ఎలా ?అని అనుకున్నాడు .అదిమొదలు దాసగణు తన నడవడిక మార్చుకున్నాడు .ఏకాదశి నాడు తప్ప ఇతర దినాలలో ఉల్లిపాయను దాసగణు తినేవాడు .ఒక రోజు బాబా ద్వారకామాయిలో వుండగా ,అక్కడే ఉన్న మరొక భక్తుడైన బాపూసాబ్ జోగ్ తో " రేపు ఏకాదశికదా ! నీవు ఉల్లిపాయలతో అయిదు శేర్ల కిచడి తయారు చేసుకుని తీసుకురా ! "అన్నాడు బాబా .జోగ్ కు ఉల్లి అంటే ఇష్టపడదు .పైగా ఏకాదశినాడు బాబా కిచడి తెమ్మన్నాడు .సరే ! అని జోగ్ మరునాడు కిచడి తయారుచేసి తీసుకొచ్చాడు .బాబాకు ఆ కిచడి నివేదించాడు .సాయబాబా నవ్వి ,ఆ కిచడిలో కొంతభాగము నోట్లో వేసుకొని ,కొంచం కిచడిని జోగ్ ను తినమని అదేశించారు .జోగ్ కర్మిష్ఠి అయినా సందేహించలేదు .తన గురువు వాక్కును శిరసావహించదలచాడు .బాబా చెప్పినట్లే నోట్లో వేసుకున్నాడు .గురువు వాక్కు వేదవాక్కు .వారి అదేశాన్ని పాటించ వలిసిందే .ఒకసారి గురువును నమ్మిన తరువాత వెనుకకు పోరాదు .నిజమైన భక్తి అంటే గురువు చెప్పింది పాటించడమే .

మన హృదయార్పణమే *బాబా* కి నిజమైన పూజ.

మనల్ని అనేక విధాల ఆదుకుంటున్న బాబాకి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాము

పూజా సమయంలో యథాశక్తి మనకి ఉన్నంతలో
పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాము
బాబా కి సమర్పించే అంత వారామా. కేవలం అది కృతజ్ఞత సూచకం. అంతే కాని అసలు మనిషి భగవంతుడికి ఏమన్నా సమర్పించగల శక్తిమంతుడేనా?
ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.

భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి. ఆయనకి మనం కానుకలు ఇవ్వగలమా?

కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే మన మనసు వూరుకోదు.

అప్పుడు పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ బాబాతో ఇలా విన్నవించుకోవాలి. సాయిశ్వరా!!
బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. నిన్ను ఎలా *ఆవాహన* చేయాలి?
అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు *ఆసనం* ఎక్కడ వేయాలి?
పరిశుద్ధుడవైన నీకు *ఆచమనం* అవసరమా?
నిత్యనిర్మలుడవైన నీకు *స్నానం* ఎలా చేయించాలి?
ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు *వస్త్రం* ఎలా ధరింపజేయాలి?
గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు *యజ్ఞోపవీతం* సమర్పించే అంత వాడినా?
ఏ లేపనాలూ అవసరం లేని నీకు *గంధం* ఎలా పూయాలి?
నిత్య పరిమళుడవైన నీకు *పూలు* పెట్టడం ఎందుకు?
నిత్య నిరంజనుడవైన నీకు *ధూపం* వేయడం సరి అయినదేనా?
జగత్తుకే వెలుగునిచ్చే నీకు *దీపం* అవసరమా?

మా ఆకలి దప్పికలు తీర్చే నీకు *నైవేద్యం* పెట్టేటంత వాడినా?

విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు *తాంబూలాన్ని* అర్పించగలనా?
అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు *ప్రదక్షిణం* ఎలా చేయగలను?
వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా *స్తుతించాలి*?'

భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే.

అయినా భగవంతుడు మనం చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.

*బాబా* మన నుంచి కోరేవి పూజలు, సంపదలు, వ్రతాలు కావు.

ఆయన మన నుంచి *హృదయార్పణను* కోరతాడు.
భక్తితో స్మరిస్తే చాలునంటాడు.

కనుక మనం ఇవ్వడగినది ఆయన మననుండి ఆశించేది
కేవలం మన మనసే.
అది నీకు సమర్పిస్తున్నాను!'

మన హృదయార్పణమే *బాబా* కి నిజమైన పూజ.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార