శ్రీ సాయినాథ ప్రార్థన

బాబా! ఈ అనంత విశ్వానికి నీవే తల్లివి, తండ్రివి. నీ నీడలో పయనించే మేమంతా నీ బిడ్డలము. కర్తవు నీవే అయినా ఫలములను మాకు అందించి కీర్తి పతాకముల నెగరవేయుచున్నావు. ఫలప్రదాతవు నీవు, అభయహస్తములతో కరుణా కటాక్షమ్ములతో ఎదురు నిలచి ప్రేమను అందించుచున్నావు.

ప్రశాంతవదనా ! పరబ్రహ్మ ! నీ చరణాలను అందుకున్న మా భాగ్యమును వివరించగలమా? సముద్ర నీటి బిందువులను లెక్కించశక్తి గలవారు కూడను సమర్థ సద్గురువు అయిన నీ లీలలను లెక్కించవారితరము కాదయ్య. చల్లని తండ్రి లా మము బ్రోచినావు. మా ప్రార్థనా గీతములలో, మా హారతి పాటలలో మా ఆర్తి పుష్పాలను చేర్చి నీకు అర్పించుచున్నాము . మహాత్మా! మా హృదయాలలో మంచినే నీవు పెంపొందించు, దుష్టలక్షణములనెల్ల తొలగించు, వైరాగ్య భావనలతో మా మనస్సులలో జ్ఞాణజ్యోతులనే వెలిగించు.సర్వమూ నీలో నిక్షిప్తమై యున్నది సర్వేశ్వరా! అకుంఠిత దీక్షతో నీ పాదసేవలనే మాచే చేయించు. ఈ లక్ష్యమార్గములో అవాంతరములనే తొలగించు. సాధనామార్గములో పవిత్రపుష్పాలనే మాకు అందించు గురుదేవా.... మా ఆరాధనలు అందుకోవా పరంధామా ! నీ అమృత వాక్కులలో పరమార్థములను మాకు భోదించవా దేవదేవా!

కరుణామయా! సద్గురు ! నీ అండనే వుండగా మాకు భయమన్నదే లేదు . నీ దివ్య దీవెనలు అందుకున్న మా జన్మలకు చరితార్థము కలిగించినావు. సర్వేశ్వరా! సాధుపుంగవా! పరమపూజ్య సద్గురునాథా! నీ దివ్య పాదములకివే శతకోటి వందనములు దేవా. మనస్సంతా నీవే నిండిపోయి మా కార్యములన్నియు సఫలము చేసేటి సాయిబాబా ! మా కట్టెదుటే నిలచి ప్రతి ఇంటినీ పావనము చేసి మాకు పరమార్థమును బోధించిన మా సాయితండ్రీ నీకివే వందనములు బాబా.

(సేకరణ : సాయితనయ (సాయిప్రేమ) మాసపత్రిక నుంచి)
[18/06, 8:53 PM] +91 93468 23570: ? "నీకు మన ద్వారకామాయీ తెలియునా ! నీవిప్పుడు కూర్చున్నదే. ఎవరు ఆమె ఒడిలో కూర్చునెదరో వారిని ఆమె కష్టముల నుండి తప్పించును. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి " అని అన్నారు సాయిబాబా.

? మన తల్లి బాబాగారు అని బాబాగారే చెప్పారు. కావున, ఈ ప్రపంచంలో అనాథ అనే వారే లేరు. అమ్మలగన్న అమ్మ మన సాయినాథుడే. ఎవరుకూడా అనగా ఎవరికైన తల్లిదండ్రులు లేనియెడల వారు చింతించవద్దు. అందరికి తల్లి సాయినాథుడే మరియు తండ్రి కూడా సాయిబాబా గారే. అందుకే వారిని అనాదరక్షకుడని అంటారు.

? పైన చెప్పిన అభయం బాలాసాహెబ్ మీర్కర్ అనే భక్తుడివిషయం. సాయి ఆ భక్తుడికి ముందుగానే పాము గండం వున్నదని సూచించారు కానీ అభయం కూడా సాయి ఇచ్చారు.

? "అతడు మిక్కలి భయంకరమైన వాడు కానీ ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు? ".

? బాబాగారు మాటలలో జరుగబోవు కీడును మరియు ఆ కీడు జరుగదు అనే విషయం కూడా వారి మాటలలో ముందే చెప్పేవారు.

? బాలాసాహెబ్ కు జరుగబోవునది తెలిపి అభయం కూడా ఇచ్చారు. కొందరు దానిని అర్ధం చేసుకోలేక పోయారు. మరికొందరు వెంటనే బాబాగారి మాటలలోని మర్మాన్ని పట్టేసి భయం లేకుండా ముందుకు వెళ్లేవారు. అటువంటి భక్తులలో ముఖ్యమైన వారు శ్యామా !

? బాబాగారు బాలాసాహెబ్ కు తోడుగా శ్యామాను అతనితో పాటు వెళ్ళమని ఇలా అన్నారు " బాలాసాహెబ్తో చితలీ కి వెళ్ళి ఆనందించమనెను ". అంటే బాబాగారి మాటలలో "ఆనందించమనెను " అనగా రాబోవు ఆపద ఏమి చేయదనేగా ! వారు ఆనందంగా వుంటారనేగా !.

? చివరకు బాబాగారు చెప్పినట్లుగా పాము బాలాసాహెబ్ వస్త్రం పైన వచ్చినను ఏమి చేయలేదు. గండం తప్పెను.

? బాబాగారి మాటలు వెనుకకు పోవు. తప్పక జరుగును. వారి ఆజ్ఞ శిరసావహించినవారికి జన్మ ధన్యం. ఒకసారి బాబాగారు కాకా సాహెబ్ దీక్షితులు అనే బ్రాహ్మణుడితో మేకను చంపించుటకు సిద్ధమైనారు బాబా. కాకా బాబాగారి ఆజ్ఞ పాటిస్తుండగా సాయి ఇలా అన్నారు "ఎంతటి కఠినాత్ముడవు ! బ్రాహ్మణుడవై ఉండి మేకను చంపెదవా? ". అప్పుడు ఆ భక్తుడు బాబాతో "నీ అమృతం వంటి పలుకే మాకు చట్టం. మాకింకొక చట్టం తెలియదు. మీ ఆజ్ఞను పాటింతుము"

? బాబాగారు తన భక్తులను రాబోవు ఆపదలను ముందుగా చెప్పి తల్లీ వలె కాపాడినపుడు తల్లి ఏదయినా ఆజ్ఞ వేస్తె బిడ్డలైన భక్తులు పాటించాలా లేదా?. తప్పక పాటించాలి. అందుకే నిన్న ధుమాళ్ విషయంలో పరిష్కారమునకు బాబాగారి పటం ముందు చీటీలు వేసి ఆ చీటీలలో వచ్చిన దానిని బాబా ఆదేశం గా భావించి పాటించే మరో కాకా సాహెబ్ దీక్షుతులు వంటి నిజ భక్తుడు. బాబాగారిని తల్లీ అని అనుకున్న భక్తులు వారు.

? కావున ఈ లోకంలో అనాధుడనేవాడు లేడు. బాబాను నమ్మిన ఆ సాయిబాబా అందరికి తల్లీ. వారే పైన చెప్పినట్లు చెప్పారు. మనకు ఏదయినా క్లిష్ట పరిస్థితి వస్తే మనకు తల్లి లేదా తండ్రి లేరుగా అని అనుకోకండి ! మన తల్లీ తండ్రీ ఆ సాయిబాబా గారే. ధుమాళ్ లాగా సమస్యను చిట్టీల రూపంలో బాబా పటం ముందు వేసి, సాయిని తలచి తీసి దానిలో వచ్చినట్లు చేయుటయే మన కర్తవ్యం. శ్యామా, బాలాసాహెబ్, కాకా మరియు ధుమాళ్ వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుద్దాం......

........... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్.

నా జొన్న రొట్టెలు ఏవీ?*

*శ్రీరామనవమి నాడు బాబా కోసం ధనికులైన వ్యక్తులు*
ఎన్నో రకాల తినుబండారాలను
బాబాకు నివేదనగా సమర్పించుకున్నారు.

*భోజన సమయం కావస్తున్న బాబా అవేమీ* ముట్టుకోకుండా శ్యామాని పిలిచి
ఈ జనసందోహం లో ఒక ముసలావిడ లోపలికి రాలేక వీధిలో
చెట్టు కింద కూర్చుంది వెళ్లి తీసుకురా అని చెప్పాడు .

*శ్యామా ఆమెను తీసుకురాగానే బాబా*
నా జొన్న రొట్టెలు ఏవీ?అంటూ అడిగి మరీ ఆమె ఇచ్చిన జొన్న రొట్టెలను ఎంతో ఆత్రంగా తిన్నారు బాబా.

మనం ఇక్కడ గమనించవల్సింది...

*బాబా చూసేది అనన్య భక్తిని మాత్రమే.*.
మనం తెచ్చే గొప్పగా భావించే ఆహార పదార్థాలని కాదు.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

శ్రీ సాయిబాబా తిరుగలి విసిరి కాలరా వ్యాధిని పారద్రోలారు. అంతఃకరణ శుద్ధి , సాత్విక ప్రవృతి , సత్కర్మాచరణ ప్రతివారికి అవసరమైనవి. తమో, రజో ప్రవృత్తులతో పాపకర్మలు పెరుగుతాయి. ఆ పాపకర్మల ఫలితమే మనుషులకు వ్యాధులు,బాధలు,అశాంతి,నిత్యానిత్య విచక్షణాజ్ఞానలేని మొదలగు బుద్ధులు వస్తాయి. అంతులేని అనవసరపు కోరికల కాంక్షకూడా అజ్ఞానజనితమే. అంతఃకరణశుద్ధి, నిరంతర విచక్షణ లేకుంటే కామ క్రోధాది అంతఃశత్రువులు మనిషిని అజ్ఞానంలోకి తోసేస్తాయి. మంచివంట చేయడానికి పాత్రలు శుభ్రంగా ఉండం ఎలాఅవసరమో , సత్కర్మాచరణకు హృదయపవిత్ర కూడా అంతే అవసరము. కనుక అలాంటి హృదయశుద్ధి అందరికి కలిగించుటకొవాలి, వారిలోని పాపాలను దోషాలను నిత్యం క్షాళన చేయుటకా యన్నట్లు బాబా 60 సంవత్సరాలు ప్రతిరోజూ గోధుమలు విసరేవారు. " యోగః చిత్తవృత్తినిరోధకః " యని పతాంజలి యోగశాస్త్రం నిర్వచిస్తుంది. అంటే నిలకడలేని మనసును బాహ్యవిషయాలలో చిక్కనీయక అంతర్ముఖం చేయాలని, తద్వారా కలిగే మానసికశాంతికి, తృప్తికి అందరూ అర్హులేనని గుర్తుంచుకోకలగాలి.

*_శ్రీ సాయి_*
*అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయ పూర్వకమైన భక్తి.*
మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజగాని, ధ్యానము గాని చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను, ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదకుకొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను.

*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*బాబా చిత్ర పటము అంటే స్వయంగా బాబా నే*


శ్రీ కృష్ణారావు నారాయణ్ పాడుల్కర్ (చోటు భయ్యా) హార్ద లో నివాసం ఉండేవాడు. 1915 లో వీరికి బాబా దర్శనం ఇఛ్చి ” నేను సద్దు భయ్యా ఇంటికి వచ్చాను రమ్ము, వచ్చి నా దర్శనం చేసుకో” అని అన్నారు. సదాశివ్ దుదిరాజ్ (సద్దు భయ్యా) కూడా హర్దా నివాసి.

బాబా సద్దు భయ్యా ఇంటికి ఎలా వచ్చారో చూద్దాము

1915 ,ఫిబ్రవరి లో సద్దు భయ్యా కి దీక్షిత్ గారినుండి ఒక ఉత్తరం వచ్చింది. దాని సారము ,”శ్రీ ముక్తారామ్ గారిఇంట్లో బాబా యొక్క పెద్ద ఫోటో వుంది, దాన్ని ముక్తారామ్ గారు సద్దు భయ్యా కి ఇవ్వాలనే ప్రేరణ కల్గి దాన్ని తీసుకుని హార్దా వస్తున్నారు, అందువల్ల ఎవరినయినా రైల్వే స్టేషన్ కి పంపి బాబా చిత్ర పఠం తీసుకు వెళ్ళమ”ని ఆ ఉత్తరం సారము.ఈ లేఖ అందుకోగానే సద్దు భయ్యా బాబా ని ఎదుర్కొని స్వాగత సత్కారాలతో తన ఇంటికి ఆహ్వానించడానికి మరి కొంత మంది భక్తులతో స్టేషన్ చేరుకుంటాడు. ట్రైన్ రాగానే ముక్తారామ్ మరియు బాలారాం ఇద్దరి మధ్య లో బాబా పెద్ద ఫోటో ని చూసి తన్మయులవుతారు .సద్దురామ్ ఆనందం తో ట్రైన్ భోగి లో కి వెళ్లి బాబా పఠాన్ని హత్తుకుని ట్రైన్ దిగుతాడు.
అలా బాబా సద్దు భయ్యా ఇంటికి వచ్చిన రోజు శ్రీరామ నవమి ఉండెను.అందరూ బాబా ని దర్శించుకుని సాయంకాలం ఆరతి ఇచ్చారు. సద్దు గారు రుద్రాభిషేకం, పూజ.చేసాడు ..ముక్తారామ్ బలరాం సలహా మేరకు బాబా పఠాన్ని సింహాసనం పై అధిష్టింప చేశారు .ఈ విధం గా సంప్రదాయ పద్ధతుల్లో అన్ని లాంఛనాలతో బాబా వారి చిత్రం సింహాసనం పై అధిష్టించబడింది. ఫకీర్లకి దక్షిణ మరియు పెడా లు పంచబడ్డాయి.
ముక్తారామ్ ఇంటి పై కప్పు ఎక్కి బాబా జండా ని ఎగరవేయసాగాడు,అతడు ఏ ప్రదేశం పై కాలు పెట్టి నించున్నాడో, అది చాలా బలహీనం గా వుంది,ఏ సమయం లోనయిన విరిగి పోయేలా ఉండెను..అలా జండా ఎగరవేస్తుండగా, ఇంకా జండా మధ్యలో నే వుంది అంత లో తన పక్క లో విపరీతమయిన నొప్పి రాసాగింది, పంటి బిగువున నొప్పి ని భరించి అతను ఆ కార్యం పూర్తి చేసాడు ..అలా సురక్షితం గా జండా ఎగరవేసి కిందికి రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు..ఎప్పుడయితే ముక్తారామ్ పై కప్పు పై వున్నాడో ఆ సమయం లో నే షిరిడి లో బాబా పక్క లో నొప్పి మొదలయ్యింది.బాబా ఫకీర్ బాబా తో మసాజు చేయించుకుంటూ ,” అల్లాహ్ మాలిక్, పేదవారి రక్షకుడు.,అల్లాహ్ మాలిక్ కన్నా ఎవరూ గొప్పవారు కారు” అంటూ బాబా ముక్తారామ్ నొప్పి ని తన పయి వేసుకున్నారు, ముక్తారామ్ ఎక్కిన ఇటుక విరగకుండా కాపాడి తనని రక్షించారు.

సద్దు భయ్యా జీవితాంతం ఆ విధంగా బాబా ఫోటో కి సాక్షాత్తు బాబా కి సేవ చేయునట్లు నిత్య పూజ ఆరతులు ఇచ్చాడు.

1937 లో సద్దు భయ్యా దేహాంతం సంభవించింది.సాయి బాబా ద్వారా అతడికి పంపబడిన చిత్రం ఆ తర్వాత ఏ పూజ లేకుండా వేరే ఊరిలో పడి ఉండెను. బాబా సద్దు భయ్యా పుత్రుడు లక్ష్మణ రావు కి స్వప్నం లో కనిపించి, ” నేను చిత్రం రూపం లో మీ ఇంటికి వస్తే, నన్ను అవహేళన చేసి దూరం గా పెట్టారు, రెండు రోజుల్లో నన్ను ఇక్కడి నుండి విముక్తుడిని చేయక పోతే నా కాళ్ళు తెగిపోతాయి ఇక ” అని అన్నాడు. లక్ష్మణ రావు కి ఆ స్వప్నం సరిగ్గా అర్థం కాక ఎప్పటిలా తన వుద్యోగం లో నిమగ్నమయ్యాడు , కానీ అశాంతి గా ఏ పని సరిగ్గా చేయలేకపోయాడు. ఆ రోజు రాత్రి మల్లి బాబా స్వప్నం లో కనిపించి ” నువ్వు నా సూచన ని అర్థం చేసుకోలేదు, నువ్వు వచ్చి నన్ను విముక్తుడిని చేయకపోతే చెద పురుగులు నా కాళ్ళని తినేస్తాయి ” అన్నాడు..ఈసారి అతను గాభరా పడి త్వర గా తన ఊరికి వెళ్లి తన ఇంటి తలపులు తెరవగానే హైరానా పడ్డాడు. చెద పురుగులు బాబా ఫోటో యొక్క చెక్క ఫ్రేమ్ ని మొత్తం తినేసాయి, మరియు చిత్రం లోని బాబా పాదాల వేళ్ళ వరకు వచ్చేసాయి. అతను వెంటనే చిత్రాన్ని కిందికి దింపి శుబ్రపర్చాడు.తర్వాతా బాబా ఫోటో ని తన తో పాటు ఇండోర్ కి తీసుకు వెళ్లి అక్కడ ఫోటోగ్రాఫర్ చే బాగు చేయించి తన ఇంట్లో పునః ప్రతిష్టించుకున్నాడు. ఆ రోజు నుండీ పూర్తి నిష్ఠ భక్తి తో బాబా ఫోటో ని పూజాదికాలతో సేవించుకున్నాడు.

ఈ లీల ద్వారా బాబా ఫోటో లేదా విగ్రహం అంటే స్వయంగా బాబా వారే అని మనం అర్థం చేసుకోవాలి,,బాబా విగ్రహం మన ఇంట్లో ఉంటే బాబా స్వయంగా మన ఇంట్లో ఉంటున్నాడని భావించి బాబా సేవ చేసుకోవాలని మనకి తెలుస్తోంది.

*_ఓం శ్రీ సద్గురు సాయినాథయా నమః_*

*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*


*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*బాబా వారి ప్రత్యేకత ఏమనగా

బాబా వారి ప్రత్యేకత ఏమనగా* తన భక్తుల మనస్సులలో ఎవైనా మంచి ఆలోచనలు కలిగినప్పుడు, తన కరుణా కటాక్షములతో ఆ ఆలోచనలు కార్య రూపము దాల్చునట్లు చేసేవారు. ఈ విధముగా భక్తుల సత్సంకల్పములు నెరవేరునట్లు చేసి వారిని సన్మార్గము వైపు నడుచునట్లు చేసేవారు.

సాయిబాబా సచ్చరిత్ర గ్రంధకర్త అయిన హేమాడ్పంత్ కు ఎల్లప్పుడూ బాబా తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యము స్వీకరిస్తే బావుండుననిపించేది. ఏన్నొ సార్లు ఈ కోరికను బాబా ముందు వెల్లడి చేసాడు కాని ప్రతీ సారీ అతనికి బాబా నుండి ఒక చిరునవ్వే ఎదురయ్యేది.

*1917 వ సంలో హోళీ పండుగ వేకువజాము నాడు* హేమడ్పంత్ కొక కల వచ్చింది. అందులో చక్కని దుస్తులను ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి ఈ రోజున నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నానని తెలిపారు. ఆనందాశ్చర్యములతో నిద్ర నుండి లేచి చూసేసరికి హేమడ్పంత్ కు బాబా గాని, ఆ సన్యాసి గాని కనిపించలేదు. వచ్చిన కలను బాగా జ్ఞపకము తెచ్చుకొని , బాబా ఇచ్చిన వాగ్దానమునకు సంతోషించి, వెంతనే తన భార్య వద్దకు పోయి ఈ రోజున బాబా మన ఇంటికి భోజనమునకు వస్తున్నారని కావున ఎక్కువ పిండి వంటలు చేయమని చెప్పాడు. అయితే భర్త మాటలను ఆ ఇల్లాలు నమ్మలేదు. శిరిడీ లో కొలువుండే దైవం శ్రీ సాయినాధులు ఎన్నడూ కూడా శిరిడీని విడిచి వెళ్ళలేదు.
కానీ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూవుండేవి. అటువంటి శ్రీ సాయి అసంఖ్యాకమైన తన భక్తులను విడిచి బాంద్రా లోని తమ ఇంటికి వచ్చునా అని ఆమెకు సంశయము కలిగింది.అందుకు హేమడ్పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చును కానీ తన ప్రతినిధిగా ఇంకెవరినైనా పంపవచ్చు కదా అందుకని కొంచెం ఎక్కువ వంటలు చేయడంలో తప్పేమీ లేదని ఆమెకు తెలియజేసాడు.

*మధ్యాహ్నం
భోజనమునకు అన్ని ప్రయత్నాలు జరిగాయి*.హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళను వేసారు, ముగ్గులు పెట్టారు, భోజనమునకు రెండు పంక్తులు తీరాయి. రెండింటి మధ్య బాబా గారి కోసం ఒక ఆసనమును ఏర్పాటు చేసారు. హేమడ్పంత్ యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి వారి వారి స్థానములలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే అతృత. బాబా ఎప్పుడు వస్తారు ? తమ విందును స్వీకరించి తమలను ఆశీర్వదిస్తారు ?

మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నశుద్ధి అయ్యింది. నెయ్యను వడ్డించిరి. శ్రీ కృష్ణునకు నైవేద్యం సమర్పించి భోజనం ప్రారంభించేంతలో మేడ మెట్లపై చప్పుడు వినిపించింది. అంతలోనే తలుపు చప్పుడు అయ్యింది. హేమడ్పంత్ వెళ్ళి తలుపు తీయగా గుమ్మంలో ఇద్దరు మనుష్యులు కనిపించారు. వారిరువురూ తమను ఆలీ మహ్మద్ మరియు మౌలానా ఇస్ము ముజావర్ గా పరిచయం చేసుకొని తమతో తెచ్చిన ఒక ఫొటోను హేమాడ్పంత్ కు అందించారు. అందులో చిరునవ్వులొలికిస్తూ ఆభయ హస్తం అందిస్తున్న శ్రీ సాయినాదుని ఫొటొ వుంది. దానిని చూడగానే హేమాడ్పంత్ కు ఆనందంతో కళ్ళు వర్షించాయి. గొంతుకు పూడిపోయినట్లనిపించింది.
తన మాటను నిలబెట్టుకొని, సరిగ్గా భోజన సమయంలో తన ఆతిధ్యం స్వీకరించేందుకు తన వద్దకు వచ్చిన బాబా వారి భక్త పరాయణతత్వానికి మైమరిచిపోయాడు.

*హేమాడ్పంత్ యొక్క అలౌకిక ఆనంద స్థితిని చూసి ఆశ్చర్యపోయిన వారు* ఇరువురూ “ అయ్యా ! భోజనం మధ్యలో మిమ్మల్ని లేపినందుకు క్షంతవ్యులం. ఈ వస్తువు నీకు సంభందించినది కావున నీకు ఇచ్చేందుకు మేము వచ్చాము. తరువాత తీరుబడిగా ఈ పటమును యొక్క వృత్తాంతమును తమకు తెలియబరెచదము” అని ఆ ఫొటోను హేమాడ్పంత్ కు అందించి వారు వెళ్ళిపోయారు. ఆ పటమును బాబా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వుంచి, హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి , ఆ తరువాత తన కుటుంబ సభులతో కలిసి హేమాడ్పంత్ ఎంతో సంతృప్తిగా భోజనం చేసాడు.
*బాబా వారు ఎన్నటికీ తన భక్తుల కిచ్చిన వాగ్దానం తప్పరని, భక్తులకోసం తమ ప్రాణాలనైనా ఇచ్చుటకు సందేహించరని అందరూ ఈ అద్భుతమైన లీల వలన తెలుసుకున్నారు*.

*మనం కూడా అపురూపమైన ఈ జన్మలో* ఈ విశ్వానికే గురువు అయిన శ్రీ సాయినాధుని భక్తులం అయ్యినందుకు ఎంతో సంతోషించి , మనకు కలిగిన ఈ అపురూపమైన భాగ్యానికి ఆ భగవంతునికి సహస్ర కోటి కృతజ్ఞతాభివందనములను అర్పించి ఎల్లవేళలా మన గురుదేవులను సేవిస్తూ ఆయన యొక్క అపూర్వమైన, అత్యద్భుతమైన కరుణా కటాక్షములకు పాత్రులమౌదాము.

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

*శ్రీ సాయిగురుభ్యోనమః*

*మానవుని శరీరము కన్నా మించిన శరీరము ఈ సృష్టిలో దేవతలకు కూడా లేదు. అన్ని లోకాలను తిరగ గలిగే శక్తి మానవ ప్రజ్ఞకే ఉన్నది. ఇలాంటి మానవ శరీరమును చక్కగా ఉపయోగించుకోవాలి. అది అహంకారము పోతే గాని వీలుపడదు.*

*మనము నిరహంకార స్థితికి వచ్చినపుడు ఆ జన్మ శుభమైనదిగా పరిగణిస్తారు. 'నేను, నాది' అన్న భావన కన్నా దైవీ భావన ఎక్కువ స్థిరపడుతుంది. అపుడు అహంకారము బంటు వలె పనిచేస్తుంది.*

ఓం సాయి..

ఈ ప్రపంచం అంత మయే వరకు మానవులకు తోడు నీడగావుండేది
భగవంతుడు ఒక్కడే మనం వేసే ప్రతి
అడుగు మన గురువు దైవం అయిన బాబాకు విదితమే. మనం ఒక అడుగు
ముందుకువేస్తెబాబా10అడుగులుముందు ఉండి మనకుమార్గం సుగమం
చేస్తారు.మన కళ్లముందు ఉన్నది...
మాత్రమే చూడగలం కానీ బాబా కు
మన భూతభవిష్యత్ వర్తమానాలు
తెలుస్తాయి బాబాయే. మన సారధి
అతనిని మార్గదర్శకునిగా చేసుకొని
ముందుకు సాగినమహత్తర ఆశయం
తో ప్రయాణం మొదలు పెడితే మనకు
ఎటువంటి విపత్తు రాకుండా భద్రమైన
దారిలో నడిపిస్తారు.

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

శ్రీ సాయి
శ్రీ షిరిడీ వాసా ఏమి నిరాడంబరమయ్యా నీది......
సర్వ దేవి దేవతలకు సాధ్యమా సాయినీలా ఉండటం.......
భోగాలను కోరవు భాగ్యాములను ఆశించవు
అలంకారములు అవసరం లేదు.........
సాయి సాయి సాయి అని పిలిచినా చాలు....
చిటికెడు విభూతి తో మా భారాన్ని తగ్గిస్తావు......
నిండు మనసుతో తలిస్తే చాలు పరుగు పరుగున వస్తావు.....
ఆలయలు మండపాలు
దూప దీప నైవేద్యాలు ఏమీ ఆశించవు.... మా కోరిక మేరకు కొలువుదీరి వున్నావు......
ఎండ నీడ వాన గాలి ధూళి ఏమి పట్టించుకోవు
ఆర్తితో నిన్ను చేరు నీ బిడ్డలను
తగు దారి చూపాలి అని తపన తప్ప.....
నీవే సర్వ జీవకోటి యందు ఉండి నీ బిడ్డల యోగాన్ని గమ్యన్నీ చూపిస్తున్న.....
పకీర్ రూపంలో షిరిడీ ని పావనము చేసిన పరమ మూర్తి...
తండ్రి తెలిసి ఏ తప్పూ చేయలేదు
తెలియక తప్పు చేస్తే క్షమించు
నీ పాదాల చెంత కాసింత చోటు ఇవ్వు ప్రాధేయపడవేడు కుంటున్నాను సాయి.....

*_నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*


*_అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*_ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి_*

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార