శ్రీ సాయిచైతన్యశక్తి యొక్క ఉనికిని ఏ విధంగా తెలుసుకోవచ్చు ?


*శ్రీ సాయిచైతన్యాన్ని చూడలేం కనుక దాన్ని శుద్ధ మనసుతో అనుభవించటం సాధ్యం అవుతుంది. శ్రద్ధతో చేసే సాయి నామస్మరణ మనసును పరిశుద్ధం చేస్తాయి. ఏ నామం (మంత్రం) అయినా మనసును దాని మూలస్థానమైన చైతన్యం వద్దకు తీసుకువెళ్ళేందుకే ! అవి రూపంలేని చైతన్యం యొక్క ఉనికిని మనకి తెలియజేస్తాయి. మనకి గుండె కొట్టుకోవటం తెలుస్తుంది. ఆ గుండెను కొట్టించే సాయిచైతన్యం తెలియటం లేదు. గుండెను నడిపే ఆ సాయిచైతన్యశక్తికే గ్రహింపు, స్పందన, ప్రేరణ, ఆలోచన, తెలివితేటలు అలవడ్డాయి. వాటికి ఉనికిగా ఉన్న సాయిచైతన్యాన్ని మరిచి ఈ లక్షణాలే మనం అనుకుంటున్నాం. మనలోఉన్న సాయిచైతన్య స్రవంతిని మరిచిపోతున్నాం. దానితో పనిచేసే ఈ శరీరాన్ని, మనసును పట్టుకొని వ్రేలాడుతున్నాం !*

*'హృదయ స్పందనే తొలి సాయిదేవుని దైవానుగ్రహం !'*

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

*నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ అవస్థ రక్షకరం*

శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి .
ఓం అసహయ సహాయాయ నమః .
" ఎవరూ లేని దీనులకోసం సాయి చాపును కరుణా హస్తం అన్నది సాయి అభయం .నీవే తప్ప
ఇతంపరం ఎరుగ "అని సాయినాధుని శరణు వేడినచో మరు క్షణంలో ఆయన సహాయము అందుతుంది .దాసగణు మహరాజ్" కానాభిల్ "
అను గజదొంగ చేతిలో చిక్కి " సాయిబాబా " అని చేసిన అర్తనాదమే అతణ్ణి కాపాడింది .నిరుపేద గా
జీవించిన మహాకవి పోతన్నగారు ఇంటికి ఒక్కసారిగా వేయిమంది అతిధులు రాగా " నిస్సహాయుడను నీవే కాపాడు తల్లీ " అని శారదామాతను ప్రార్దించగా ,స్వయముగా రామలక్ష్మణులే వచ్చి కావలసిన సంబారాలు
అందచేసి వెళ్లారు .నిండుకొలువులో నిస్సహాయురాలుగా నిలబడిన ద్రౌపది ప్రార్థన
విన్నవాడు పరమాత్మేగదా .నిస్సహాయులైన సాయిభక్తులకు ఒక్క క్షణంలో సహాయము దొరకటమన్నది అడుగడుగునా ఆనుభూతమే .
ఒకసారి ఒక వృద్దురాలు ఎంతోదూరంనుంచి బాబా దర్శనము చేయాలనుకుని వచ్చింది .
ద్వారకామాయి ( మశీదు ) ద్వారము దగ్గరగల
జనసందోహము దాటి లొపలికి వెళ్లలేకపోయింది
చివరకి అలసిపోయి శక్తి లేక బయటనే నేలమీద
కూర్చొండిపోయింది .ఆమె బాబా కు నివేదించాలని కొన్ని రొట్టెలు కూడా తెచ్చింది .
నీరసంతో ఆకలి తట్టుకోలేక ,తెచ్చి న రొట్టెలలో
సగంపైగా తినేసింది .జరిగినదానికి చింతిస్తూ ,
బాధతో బాబాను చూడలేకపోతున్నందుకు చింతింస్తు వుండగా ,ఆ వృద్దురాలు మనసులో
ఆర్తితో పిలిచిన పిలుపు బాబాకు వినిపించిందేమో
బాబా అక్కడే ఉన్న శ్యామాను పిలచి " నాకోసం
ఒక వృద్దురాలు వచ్చి మశీదు గడప ముందు
పడియున్నది .దారి లేక అల్లాడుతున్నది .వెళ్లి
తీసుకు రా ! " అని చెప్పగా ఆ ముసలమ్మ బాబా వద్దకు వచ్చింది .ఆమె రాగానే బాబా ఆమెను ఆప్యాతయతో పలకరించి ," నాకోసం ఏమి తెచ్చావమ్మా ? "అని చెప్పి ,ఆమెవద్ద కల రొట్టెలను ఎంతో ప్రీతిగా తిన్నారు .అదీ బాబా భక్తుల ఎడల చూపే ప్రేమ హస్తం .

 
 

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార