శ్రీ షిరిడీ సాయి బాబా వారి నిజమైన పాదుకలు కోర్హాలే మందిరం లో ఏవిధంగా ప్రతిష్టించబడ్డాయి?

1998 సంవత్సరంలో విన్నీ చిట్లురి అమ్మ ‘Ambrosia in Shirdi’ కోసం విషయ సేకరణ చేస్తున్న సందర్బంలో ఆమె ఎక్కోదో చదివిన విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. అది ఏమిటంటే సాయి బాబా వారి నిజ పాదుకలు నరసింహా లాడ్జి సమీపంలో ఉన్నాయని చదివినట్లు గుర్తు. వామన్ రావు గొండ్కర్ మనుమడైన అమృతరావు గొండ కర్ గారు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. వామన రావు గొండ్కర్ ఇంటి వద్ద బాబా భిక్షని స్వీకరించేవారు.

సదా మరియు విన్నిఅమ్మా ఆ ప్రదేశమంతా బాబా నిజ పాదుకల కోసం వెదికారు. కానీ అక్కడ ఆ ప్రదేశమంతా చెత్తా చెదారం తో నిండి వుంది. ఒకసారి వారిరువురూ ద్వారకా మాయి నుండి తిరిగి వస్తుండగా సదా గోడ వున్న ఒక ప్రదేశం వైపు చూపుతూ ‘ఇవే బాబా నిజ పాదుకలు అయివుంటాయి’, ఎందుకంటే వాటి పైన ప్రదేశమంతా మందిరం ఆకారం లో వుంది’ అన్నాడు. ఒక్కసారిగా విన్నీ అమ్మ విపరీతమైన ఆశ్చర్యానికి గురయింది ఎందుకంటే ఆ ప్రదేశమంతా నేలపైనే వున్నది మరియూ పాదుకలు ఆ లాడ్జి గోడల లోనికి చెక్క బడి వున్నాయి.

వెంటనే వారు అక్కడున్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అక్కడే పాదుకలు వున్నాయి. వారు ఆ పాదుకలకు కొన్ని అగరవత్తులు వెలిగించి పూజ చేసారు. లాడ్జి యజమాని కొంత లైటింగ్ ని ఇచ్చాడు. చుట్టు పక్కల వున్న దుకాణ దారులు అగరు వత్తులు వెలిగించ సాగారు.

మే ఆరవ తేది 2004 న శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ అక్కడి పల్లకి రోడ్డును వెడల్పు చేసే క్రమంలో నరసింహా లాడ్జి ముందుభాగం కూడా తొలగించేందుకు నిర్ణయించారు. ఆ ప్రదేశం లోనే శ్రీ సాయి బాబా వారి నిజ పాదుకలు గోడలో చెక్క బడి వున్నాయి. వారందరూ ఆ పాదుకలు విరిగిపోవడం కానీ, పాడవడం కానీ జరుగుతుందని ఎంతో భాదతో వున్నారు. అటువంటి సంఘటన జరిగితే ఏమి చేయాలని వారందరూ ఒక పండితుడి ని సంప్రదించారు కూడా.

పాదుకల సమీపంలోనే వారు మూడు రోజుల పాటు అట్లాగే నిలబడి పర్యవేక్షస్తున్నారు. ఆఖరికి బుల్ డోజర్లు రానే వచ్చాయి. ఆ సాయంకాలం విన్నీ అమ్మ మరియూ ఆదం చూస్తూ నిలబడ్డారు. బుల్ డోజర్లు గోడని పగుల గొట్టాయి. రాళ్ళ న్ని పాదుకల పై బడ్డాయి. ఆ తర్వాత జరిగినదానికి విన్నీ అమ్మ కి మాటలు రాలేదు. సఖారాం షెల్కే కి చెందిన ముగ్గురు వారసులు వచ్చి ఆ పాదుకలను విన్నీ అమ్మకు మరియూ మిగిలిన వారికి అందించారు.. వారే ఒక వాహనం ఏర్పాటు చేసి కోర్హాలే పంపారు. అప్పటి నుండి ఆ పాదుకలకి నిత్య అభిషేకం మరియూ పూజా జరుగుతున్నాయి.

ఆ పాదుకలు వంద సంవత్సరాలు పైబడినవి. మిగిలిన పాదుకల వలె అవి పైకి లేచి వుండవు, ఒక రాతిపై చెక్క బడి వుంటాయి. బాబా ఆ ప్రదేశంలోని రాతి మీద నిలబడి వుండగా శిల్పి వారి పాదములను చేక్కారా అన్నట్లుగా వుంటాయి. ఇవి సాయి బాబా వారి నిజ పాదుకలు. పాదుకల ఎదురుగా ఒక చిన్న కన్నం వుంటుంది. బాబా భిక్ష కి వెళ్లి వచ్చి ఆ రాతి మీద నిలబడేవారనీ, ఆవులకీ, కుక్కలకీ భిక్ష గా తెచ్చిన ఆహారాన్ని పెట్టె వారనీ అంటారు. అలాగే తెచ్చిన వాటిలో ద్రవ పదార్దాలను పాదుకల ఎదురుగా వున్న కన్నం లోనికి వేసేవారు. ఒక్కోసారి ఆ కన్నం లోనికి నీటిని పోసేవారు పక్షులు త్రాగేందుకు వీలుగా,

ఆ పాదుకలు ఇప్పుడు శిరిడీకి పది కిలోమీటర్ల దూరంలో వున్న కోర్హాలే గ్రామంలో ఉన్నాయి. భక్తులు స్వంత వాహన సౌకర్యం ఏర్పాటు చేసికుని వెళ్ళవచ్చు. షిరిడీ ఎయిర్ పోర్టు దారిలో ఈ మందిరం వున్నది. (విన్నీ అమ్మ వ్రాసిన బాబా’ స్ వాణి – హిస్ సేయింగ్స్ అండ్ టీచింగ్స్’ అను గ్రంధం నుండి అనువాదం)

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార