శ్రద్ద -సబూరీ

షిర్డీ సాయిబాబా శ్రద్ద -సబూరీలకు పెద్దపీట వేశారు .షిరిడీలో 1909 సం.లో ప్రారంభమైన గురుపూర్ణిమ ఉత్సవాలు యధావిధిగా ప్రతీ ఆషాఢపూర్ణిమకు గురుపూర్ణిమ ఉత్సవాలు నేటికినీ కొనసాగుతునే వున్నాయి .ఆలా 1914 సం .లో షిరిడీలో ఒక గురుపూర్ణిమ సందర్భంగా విశేషముగా ప్రసాదాలు తయారుచేస్తున్నారు .
ఆ సందర్భంగా సాయిభక్తురాలైన రాధాకృష్ణ మాయి ,మసాల దినుసులు పొడిచేసేందుకు ఒక పెద్ద రోలును తరలించవలసి వచ్చింది .ఆ సమయములో ఆమెకు సహాయము చేసేందుకు
ఎం .బి .రేగే అను భక్తుడు అక్కడకు వచ్చాడు .అదే సమయములో పురందరే అనే మరొక బాబా భక్తుడు ఆ పెద్ద రోలును కదలించడానికి వారితో కలిశాడు .ఆలా ఆ రోలును కదిలించడంలో రేగే
చెయ్యి ఆ రోలుక్రిందపడి నుజ్జయిపోయేది .కానీ అది గమనించిన రాధాకృష్ణమాయి చాకచాక్యంగా ఆ రోలును తనవైపు తిప్పుకొని రేగెను కాపాడింది
అలాచేయడంలో ఆమె చూపుడువేలు రోలుక్రింద నలిగి రక్తం కారసాగింది .వెంటనే ఆమె ఒక గుడ్డను నూనెలో తడిపి తన వేలుకు చుట్టుకొంది .ఆలా ఆ తరువాత మిగిలిన కార్యక్రమము
పూర్తిచేసి వంటల పని ముగించింది .ఆ పని అంతా పూర్తిఅయ్యేక రేగెను వెంటబెట్టుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ తీరేదాకా షుమారు అరగంట సేపు విలపించింది .తన వేలు
చిట్లినప్పుడు ,బాధతో విలపిస్తే మిగతా పనులు దెబ్బతింటాయని ఓర్పుతో భరించింది .అపూర్వ కార్యదక్షతతో బాబాను సేవించిన ఆ భక్తురాలు చిరస్మరణేయురాలు .శిర్డీసాయి బాబాను మనసావాచాకర్మణా అంకితమైన సుందరీబాయి క్షీరసాగర్ అనే రాధాకృష్ణమాయి ధన్యురాలు .

బాబా - ఊదీ (విభూతి) మహిమ

విభూతి ఈ ప్రపంచం నశ్వరం అన్న సందేశానికి ప్రతీక.

భక్తుల కష్టాలను తీర్చడంలో ఊదీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఊదీని తన ఆస్తిగా, భక్తులకు ఇచ్చే కానుకగా బాబా చెప్పేవారు.

ఊదీనే కానక్కర్లేదు: ఊదీ అంటే బాబా ధునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. అవసరమైనప్పుడు బాబాను తల్చుకుని దాల్చినదేదైనా ఊదీ సమానమైన మహిమతో నిండిపోతుంది. బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది? అందుకే బాబాభక్తుడైన నారాయణరావు, తన స్నేహితుడు తేలుకాటుతో విలవిల్లాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊదీ కోసం వెతికాడు. కానీ ఎంతకీ ఊదీ కనిపించకపోవడంతో... అగరువత్తి నుంచి రాలిన బూడిదనే ఊదీగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు. నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి, అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది. ఇలాంటి సంఘటనే నానాసాహెబు హయాంలోనూ జరిగింది. నానాసాహెబు ఒకనాడు ఠాణా రైల్వేస్టేషనులో నిల్చొని ఉండగా, తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకుని, సాయిని తల్చుకుని, తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు. అంతే! ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగలక్షణాలు సద్దుమణిగిపోయినట్లు తెలిసింది.

జామ్నేర్‌ లీల: బాబా మహిమలలోకెల్లా మహిమాన్వితం జామ్నేర్‌ వృత్తాంతం. బాబా పరమభక్తుడైన నానాసాహెబ్ కూతురు మైనతాయి పురిటినొప్పులతో సతమతమైపోతోంది. తాను ఎంత బాబాభక్తుడైనప్పటికీ, నానాసాహెబ్‌కు ఆమె స్థితిని చూసి భయం మొదలైంది. అందుకే ఈ పరిస్థితిని స్వయంగానే చక్కదిద్దుదామనుకున్నారు బాబా. శిరిడీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరుతున్న రామ్‌గీర్‌బువా అనే భక్తుని చేతికి ఊదీని, హారతి పాటను ఇచ్చి, వాటిని నానాసాహెబుకి అందించమన్నారు.

రామ్‌గీర్‌బువా వద్దనేమో నానాసాహెబు ఇంటికి చేరుకునేంత డబ్బు లేదయ్యే! అయినా ఓ ఆగంతుకుడు రామ్‌గీర్‌బువాను జలగామ్‌ నుంచి జామ్నేర్‌కు తన టాంగాలో తీసుకుని పోవడం; జామ్నేర్‌ దగ్గరలో రామ్‌గీర్‌బువా టాంగాను దిగగానే, అది అదృశ్యం కావడం తరచూ వినే ఘట్టమే! బాబా స్వయంగా పంపిన ఊదీని మైనతాయికి అందించి, హారతిని పాడిన కొద్ది నిమిషములలోనే సుఖప్రసవం జరిగిన వార్త నానాసాహెబ్ చెవినపడుతుంది. ఇంతకీ రామ్‌గీర్‌బువాను గమ్యాన్ని చేర్చిన ఆ ఆగంతకుడు ఎవ్వరో, ఆ టాంగా ఎక్కడిదో ఎవ్వరికీ అంతుచిక్కకుండా పోతుంది. ఈ జామ్నేర్‌ లీల గురించి తరువాత కాలంలో తమిళనాడుకు చెందిన బి.వి. నరసింహస్వామి కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ ఘట్టానికి ప్రత్యక్ష్య సాక్షులైన మైనతాయి, రామ్‌గీర్‌బువాలతో మాట్లాడి సచ్చరిత్రలో ఉన్నదంతా నిజమేనని ధృవీకరించారు.

సర్వరోగనివారిణి! బాబా చరిత్రలో ఊదీకి సంబంధించి మహిమలు అడుగడుగునా కనిపిస్తాయి. ఊదీని కలిపిన నీటితో మూర్ఛరోగం తగ్గడం, ఊదీతో ప్లేగు వ్యాధి ఉపశమించడం, రాచకురుపుతో బాధపడుతున్నవారు సైతం ఊదీతో స్వస్థత చెందడం... ఇలా సచ్చరిత్రలో అడుగడుగునా ఊదీ వైభవం కనిపిస్తుంది. కానీ దానికి కారణం తాను కాదంటూ వినమ్రంగా చెబుతారు బాబా. ‘నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు’ అన్నది బాబా మాట.

సర్వ కష్ట హరణం! ఊదీతో నయమయ్యే రోగాల గురించే కాదు, ఆపత్కాలంలో ఊదీతో తీరిన కష్టాల గురించి కూడా సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది. ఉదా॥ బాలాజీ నేవాస్కరు అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ, కొలుచుకుంటూ గడిపేశాడు. అలాంటి బాలాజీ సంవత్సరీకాన్ని అతని కుటుంబం శ్రద్ధగా నిర్వహించాలనుకుంది. కానీ నేవార్కరు కుటుంబం ఊహించినదానికంటే మూడురెట్లు బంధువురు ఆ సంవత్సరీకానికి వచ్చారు. వారిలో వంటకాలు చూస్తేనేమో వారిలో మూడోవంతుకి మాత్రమే సరిపోయేట్లు ఉన్నాయి. ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాభరాపడిపోయింది. కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నింటి మీదా కాస్త ఊదీని చల్లి, వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. ఇది సాయి ఆహారమేననీ! ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడనీ... అభయమిచ్చింది. బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా... ఇంకా మిగిలిపోయాయి కూడా!

బాబా సచ్చరిత్రలోనూ, ఆయన గురించి ఇతరత్రా ఉన్న సాహిత్యంలోనూ ఇలాంటి మహిమలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇక భక్తుల వ్యక్తిగత అనుభవాల గురించైతే చెప్పనే అవసరం లేదు. నమ్మినవారికి నమ్మనంత!

పని మనది, ఫలితం ఇచ్చేది సాయిదేవునిది

మనిషిది చాలా విచిత్ర స్వభావం. అంతా తాను అనుకున్నట్లే జరిగితే ' తన గొప్ప' అను కుంటాడు. కొంచెం అటు ఇటు అయితే మాత్రం ' దేవుడిలా చేశాడేమిటీ? అనో, దేవుడా! నాకు నీవే దిక్కు' అనో అంటాడు. అసలు వాస్తవం వేరు ఫలితం దైవ సంకల్పం. ఎటొచ్చీ చేసే పనిని మనస్సు పెట్టి చేయడమే మన కర్తవ్యం.

చెడుకానీ, మంచికానీ, దేనికీ మనం కర్తలం కాము. అన్నీ' నేనే' చేస్తున్నానని, ' అంతా నా వల్లే అవుతుందని ' అనుకో కూడదు. ఫలితాన్ని సాయి దేవునికి వదలి వేయాలి.

శిరిడీ సాయి పనిని దైవ కార్యంగా భావించమన్నారు. సద్గురు సాయి భోధనల్లోని అద్వితీయ అంశం కూడా అదే.! బాబా ఎవర్నీ పనులు మాను కోని, పూజలు చేయమని చెప్పలేదు. పైగా పని చేస్తూనే దైవ స్మరణ చేస్తూ, పుణ్యాన్ని మూటకట్టుకోమని సలహా ఇచ్చారు.

మనిషి స్వభావంలోని మరో అవలక్షణం - పని మొదలు పెట్టకుండానే ఫలితం గురించి అంచనాలు, లెక్కలు వేసుకోవడం, ఒక పని తలపెడితే మనసు పెట్టి చేసుకుంటూ పోవాలి. ఫలితం అనుకూలిస్తుందా? లాభమా? లేక నష్టమా? అనేది పట్టించుకోకూడదు.

మనం చేసేది మంచి పని అయినప్పుడు, అందులో అంకితభావం ఉంటే, దేవుని సంకల్పం మనవైపే ఉంటుంది. ఇది గమనించి మనమంతా సద్గురు సాయి మహరాజ్ మార్గంలో ముందుకు సాగుదాం.

స్వప్నములో బంగారపు వడగళ్ల వాన పడుతుంది. అవసరానికి పనికి వస్తుందని అత్యంత శ్రమతో వాటిని మూటకట్టుకునే ప్రయత్నం చేస్తే, మెలుకువ రాగానే అవి మాయమవుతాయి. కాని ఆశ ఎంత చెడ్డదో మనం ఇక్కడ గమనించాలి.

సూర్యకాంతిలో చూడలేని దానిని, మన బుద్ధికి అందని దానిని, వేద శృతులకు అంతు పట్టని దానిని, మన సాయి గురువు తమచేత్తో చూపిస్తారు. ఫలాపేక్షను త్యజించి, ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చి వారిని సద్గురువులు తమ అక్కన చేర్చుకుంటారు.

లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి, సంతోషం ఉండవు. సాధన చేసేవారి లో ఒక్క లోభముందా, సాధనలన్నీ మట్టి కొట్టుకు పోతాయి. అంతెందుకు బెల్లం తినాలన్న కోరిక మిగిలితేనే మరోజన్మ ఏర్పడుతుందని రామకృష్ణ పరమహంస అన్నారు. మరి మన జన్మను ఇదే ఆఖరి జన్మ చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉన్నప్పుడు ఎవరి ప్రయత్నం ఎంతవరకో, ఎవరి గమ్యం ఎంతవరకో ఆ సాయి కే ఎరుక. అందరకీ సాయిరామ్. ఓం శ్రీ సాయి సద్గురువే నమః.

భగవతగీత నందు ఉన్న గొప్ప శ్లోకం


*దైవీ సంపద్విమోక్షాయ, నిబంధా యాసురీ మతా*.. అని గీతాచార్యుడు అర్జునునితో అన్నాడు. దైవీగుణాలు బంధనివృత్తికి (మోక్షానికి), ఆసురీ గుణాలు సర్వబంధాలకు కారణమవుతాయని దీని అర్థం.

ఈ ప్రపంచంలో శ్రీ సాయినాధుని ఆనుగ్రహంతో సాధించలేనిది ఏదీ లేదన్నది ఎంత నిజమో.. అహంకారాగ్నితో రగిలేవారు అదే అగ్నికి ఆహుతి కావడం అన్నది అంతే నిజం. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటి దుర్గుణాలు అహంకారానికి అత్యంత ఆత్మీయమైనవి. శ్రీ సాయినాధునితో అనుబంధం(నమ్మకం) పంచుకుంటూ పెంచుకుంటూ ఉంటే అది ఆ దుర్గుణాలను తొలగించివేస్తుంది. అంతవరకూ శూన్యంగా ఉన్న ఆత్మ(హృదయం) అనే అంతరాలయంలో శ్రీ సాయిదేవుని ప్రతిష్ఠి చేయగానే మనలో మనం అహర్నిశము ఆ సద్గురుసాయిపరమాత్మడి నామాన్ని జపిస్తూ, ధ్యానిస్తూ కనుల నిండా, మనసు నిండా, బుద్ధి నిండా ఆ దివ్య సుందరమూర్తిని నిలుపుకొని సాయిసేవకు అంకితమవుతుంది. మరణం జీవులందరికీ తప్పకుండా వస్తుంది. ఇది మళ్ళీ పట్టడానికి నికి ముఖ్యకారణము. ప్రతి వస్తువుకూ ఎప్పుడో ఒకప్పుడు నాశనం అవ్వడం అతిసహజం. అలాగే దేహానికి చావు తప్పదు. కానీ ఆత్మకు చావు లేదు. ఎందుకంటే ఆత్మ దైవాంశం కాబట్టి. శ్రీ సాయి శ్రీ సాయి అనే పవిత్రమైన నామాన్ని విడివడచిన వారు ఆత్మాణువుల రేణువులే ఈ సృష్టిలోని ప్రతిజీవీ కూడా అంటే మనమందరితో ఈ జీవసృష్టి. సంసార తాపత్రయ బంధనాలే ఆ జీవి అజ్ఞానానికి (భగవంతుణ్ణి చేరకుండా ఉండేందుకు)కారణమవుతాయి. ఆ సద్గురువును చేరాలి అని ఆలోచన కలగనంతవరకూ దేహమే శాశ్వతం అనే భ్రాంతి ఏర్పడి తద్వారా అశాంతి అనే అర్ణవంలో మానవులు మునిగితేలుతూ ఉంటారు. ఆ బంధనాల(నాది, నాకోసం, నేను, నావాళ్ళు, నా) నుంచి బయటపడవేసేది శ్రీ సాయిభాగవాని అనుగ్రహమే.


అందుకోసం నిరంతరం సాయినమాన్ని చేద్దాం....


*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*షామాకు బాబాతో అనుబంధాన్ని తెల్పే కొన్ని మచ్చు తునకలు :*


ఒకరోజు బాబా చేతిలో ఎవరో ఏవో పప్పులు పిడికెడు పోశారు. ఆయన వెంటనే శ్యామాను పిలిచి, పప్పులతని చేతిలోపోసి తినమన్నారు. శ్యామా ఆశ్చర్యంతో, ”ఛీ ఛీ, యివ్వాళ ఏకాదశి కదా! ఈనాడవితిని పాపం కొనితెచ్చు కోమంటారా? నేనవి ముట్టుకోనైనా ముట్టుకోను” అన్నాడు. బాబా నవ్వుతూ “సరే తినవద్దులే!” అన్నారు.

మరొకసారి ఒక భక్తుడు బాబాను, “సాయి,ఏకాదశివంటి పర్వదినాలలో ఎవరైనా ఉల్లి తినవచ్చా?” అని అడిగాడు. బాబా ఏమీ తడుముకోకుండా వెంటనే, ” ఆహా తినకూడదు” అన్నారు. ఆ భక్తుడు అంతటితో విడచి పెట్టక, “అదేమీ, అదికూడ అన్ని దుంపల వంటిదే కదా. దానిని మాత్రమే ఏకాదశినాడు ఎందుకు తినకూడదు?” అని అడిగారు. బాబా నవ్వుతూ, ”తింటే ప్రమాదమీ లేదు, తినవచ్చు” అన్నారు.

అంతవరకూ వారిరువురి సంభాషణనూ ఎంతో శ్రద్ధగా వింటున్న శ్యామా కల్పించుకొని ఆవేశంగా అడిగాడు. ”దేవా, మీరింత తికమకలుగా గోడమీద పిల్లివాటంగా మాట్లాడతారేమి? ఒకమాటు వుల్లితినవచ్చంటారు, మరొకసారి తినకూడదటారు. మీరు చెప్పదలచుకున్నదేదో స్పష్టంగా, నిర్మొహమాటంగా చెప్పవచ్చుకదా?” అన్నాడు. బాబా నవ్వి ఎంతో అనునయంగా, ” శ్యామా, నేనీ మశీదులో కూర్చున్నాక అబద్ధమెన్నడూ చెప్పను, నీమీద ఒట్టు. ఏకాదశినాడు ఉల్లి తినగూడదని, అలాగాక తినదల్చుకుంటే ఉల్లి మొత్తం (ఉల్లిగడ్డనుగూడ మొత్తంగా) తిని హరించుకోగల జీర్ణశక్తి గలవారు మాత్రమే తినాలంటాను. అలాగనివారు అట్టి ప్రయత్నం చేయకూడదు” అన్నారు.

బాబా రోజూ తమకొచ్చే దక్షిణలు సుమారు రు. 500/-లు సూర్యాస్తమయ సమయంలో ఆరతి అయ్యాక భక్తులకు, పేదసాదలకూ పంచేవారు; తాత్యాకోతే వంటి కొందరు భక్తులకు నియమంగా రోజూ ఒకే మొత్తమిచ్చేవారు. కాని మహల్సాపతికి, శ్యామాకు మాత్రం ఎప్పుడూ ఏమీ యిచ్చేవారుగారు. ఒకసారి అతడు, ” బాబా, నీవెందరికో సిరిసంపదలిచ్చావుగదా, నాకివ్వలేదేమి?” అని అడిగాడు గూడా. సాయి ఎంతో (పేమగా, ” సిరి సంపదలు నీకు తగవు. నీకివ్వ వలసినది వేరు” అన్నారు, ఆయన అతనికివ్వదలచిన దేమిటి? దానికి సమాధానం సాయి యింకొకప్పుడు సూచించారు. అతడు కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకమూ నిజంగా వుంటే చూపించమని కోరితే బాబా అతనికి వాటి దర్శనమిప్పించి, ” మనం కోరవలసినది యివే వీగావు, వీటికి పైనున్నది” అన్నారు. అదీ అతనికి ఆయన ప్రసాదించదలచినది.

ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోటు వచ్చింది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరకు బాబా పై పట్టరాని కోపంతో మశీదుకు వెళ్ళి, దేవా! నీవెంత కఠినాత్ముడు, ప్రక్కవాడు చస్తున్నా ఏమీ పట్టించుకోనివాడు యింకెవరూ వుండరు. అందరికీ ఏమేమో మందులతో గాని, మహిమలతోగాని ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నావుగాని, నేనీ బాధతో మెలికలు తిరిగిపోతూ నిన్నెంతగా ప్రార్థించినా పట్టించుకోవేం? ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా వుందా? నీవేం దేవుడివి? నాకంటిబాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో, నిన్నీ మశీదులోంచి వెళ్ళగొట్టడం తథ్యం. ఆ పని చేయకుంటే నేను నీ శ్యామానే గాదు!” ఆన్నాడు. బాబా ప్రశాంతంగా విని ఎంతో ప్రేమగా నవ్వుతూ, శ్యామా! ఏమిటి నీ పిచ్చివాగుడు? ఏడు మిరియాలు నీటిలో గంధంగా అరగదీసి కళ్ళల్లో పెట్టుకో! అదే తగ్గిపోతుంది. ఈ ఉదీ తీసుకుని వెళ్ళు!” అన్నారు. ఈసారి శ్యామా మరింత రెచ్చిపోయాడు, ” ఏమి తెలివయ్యా! నీకీ వైద్య మెవడు నేర్పాడట? నాకళ్ళేమన్నా పోవాలనా, మిరియాలు కళ్ళల్లో పెట్టుకోమంటావ్?” అన్నాడు. బాబా అతని మాటలేవీ పట్టించుకోకుండా, ” నీ అతి తెలివి చాలు, ఉదీ తీసుకుపోయి చెప్పినట్లు చేయి, తగ్గకపోతే నీ యిష్టమొచ్చింది చేయచ్చు” అన్నారు. శ్యామా పైకి అలా మాట్లాడినా ఆయన మాటమీద విశ్వాసంతో ఆయన చెప్పినట్లే చేశాడు. దానితో ఆ బాధపూర్తిగా తగ్గిపోయింది.

బాబా యితనినెంతో ప్రేమగా చూచుకొనేవారు. సాయంత్రమయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులనుతప్ప బాబా ఎవరినీ మశీదులోకి రానిచ్చేవారుగాదు. కాని శ్యామానుమాత్రం యథేచ్చగా ఏ సమయంలోనైనా రానిచ్చే వారు బాబా. తాత్యాసాహెబ్ నూల్కర్ ప్రమాదంగా జబ్బుపడి చివరిరోజు అర్థరాత్రి బాబా పాదతీర్థం కావాలని కోరాడు. ఆ వేళగాని వేళ మశీదుకు వెళ్ళి బాబాను నిద్రేలేపి ఆయన పాదతీర్థం తీసుకునేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. అపుడు శ్యామా అందుకు పూనుకుని, నెమ్మదిగా చప్పుడుగాకుండా మశీదులోకి ప్రవేశించాడు. అది చూచిన బాబా అతనిని తన్నాలని కాలు పైకెత్తారు. ఆయన కోపాన్ని పట్టించుకోకుండా అతడు తనతో సిద్ధంగా తీసుకు వెళ్ళిన నీటి పాత్రలో వారి బొటన వేలు ముంచుకొని మరుక్షణమే పరుగెత్తిపోయాడు. ఆ తీర్థం నోట్లో పోయగానే నూల్కర్ ఎంతో తృప్తిగా ప్రాణం విడిచాడు.

నిత్యమూ మధ్యాహ్న ఆరతి అయ్యాక మాధవరావ్ దేశ్ పాండే బాబా వద్దకు వెళ్ళి, “దేవా! మీరు లేచి మీ స్థానంలోకి వెళ్ళండి. భక్తులు సమర్పించే నైవేద్యాలు స్వీకరించి, అవన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచండి” అని చెప్పేవాడు. వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవానిలా నింబారు వద్దకు వెళ్ళి కూర్చుని అతను చెప్పినట్లు చేసేవారు.

షోలాపూర్ కు చెందిన శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు 27 సం.లపాటు బిడ్డలు కలుగలేదు. ఆమె తన సవతి కొడుకుతో శిరిడీవచ్చ

ి బాబా సేవలో రెండు మాసాలున్నది గాని, భక్తులందరి యెదుట ఆయనకు తమ కోర్కె నివేదించుకోలేకపోయింది. ఆమె శ్యామాతో చెప్పుకోగా ‘ అతడు ఆమెనొక కొబ్బరి కాయ తీసుకొని మశీదుకు రమ్మనమని చెప్పి బాబాతో, ”దేవా, ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకిచ్చి ఆమెకు కొడుకు పుట్టేలా ఆశీర్వదించు” అన్నాడు. మొదట చాలా సేపు బాబా అంగీకరించక అతడితో వాదించారు. చివరకు, ఆమె పమిటి చెరుగులో కాయవేసి ఆశీర్వదించారు. సం.లోగా ఆమెకు కొడుకు పుట్టాడు. వారు బిడ్డను తీసుకుని మరల బాబాను దర్శించి తాము మొక్కుకున్నట్లే శ్యామకర్ల గుఱ్ఱము ) కు శాల నిర్మించడానికని రు. 500/-లు సమర్పించుకొన్నారు.

సాయి సేవవలన శ్యామా తన వైద్యవృత్తిలో దప్ప మరేవిధమైన లౌకిక ప్రయోజనాన్ని పొందలేదుగాని, ఆయన ప్రేమను, ప్రత్యేకమైన ప్రసాదాలనుమాత్రం పొందేవాడు. ఒకసారి వామన్ నార్వేకర్ అను భక్తుడు బాబాకొక వెండినాణెం సమర్పించాడు. దాని మీద ఒక ప్రక్క సీతారామ లక్ష్మణుల బొమ్మ. మరొక్క ప్రక్క హనుమంతుని బొమ్మా వున్నాయి. బాబా దానిని తీసుకొని పిలవాడిలా ఎంతో సంతోషంతో, ఆసక్తితో చాలా సేపు అటూ యిటూ తిప్పిచూచారు. దానిని వారి ప్రసాదంగా తనకివ్వమని నార్వేకర్ అడిగాడు. బాబా అయిష్టంగా, ” రు. 25/-లు దక్షిణ యిస్తే యిదిచ్చేస్తాను” అన్నారు. నార్వేకర్ వెంటనే ఆ పైకం సమర్పించాడు. బాబా నవ్వి, “అబ్బా ఎంత ఆశ! నీను పాతిక రూపాయలు కాదుగదా నాణాలరాశి కుమ్మరించినా దీనిని మాత్రం తిరిగివ్వను!” అన్నారు. కాని తర్వాత అది శ్యామాకిచ్చి నిత్యమూ పూజించు కోమన్నారు. అలాగే అతనికి ఏకనాథ బాగవతము, విష్ణు సహస్రనామము, వెండి పాదుకలు, వెండి విగ్రహాలు- యిలా ఎన్నో పవిత్రమైన వస్తువులిచ్చారు. అంతేగానీ, అతడికి డబ్బుమాత్రమెప్పుడూ యివ్వలేదు. ఎవరైనా యిచ్చినా, అతనిని తీసుకోనిచ్చేవారుగాదు. ఒకప్పుడు మహారాష్ట్ర రాజైన సింథియా అతనికి రు. 5000/-లు బహుకరించాలనుకొన్నాడు. కానీ బాబా అతనిని మందలించి ఆ ప్రయత్నం, మాన్పించారు. అయితే శ్యామాకు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు బాబా ప్రసాదించారు. అతడావిధంగా ద్వారక, రామేశ్వరము, జగన్నాధము, బదరీ నారాయణ్, బదరీకేదార్, గంగోత్రి, యమునోత్రి, కాశీ, అయోధ్య, ప్రయాగ, మధుర, గోకులము, బృందావనము, గయ, హరిద్వార్, ఉజ్జయినీ,జ్ జ్ గిర్నార్, నాసిక్, త్రయంబకేశ్వరమూ, గాణాపురము, అక్కల్ కోట, పండర్ పూర్, కొల్హాపూర్, తుల్జాపూర్, తిరుపతి, శ్రీరంగపట్నం, కంచి, మొ.న వన్నీ దర్శించాడు. సాయి దయవలన యీ యాత్రలన్నీ అతడికెంతో సుఖంగానూ, వైభవో పేతంగానూ అయ్యాయి. అతనినెందరో కోటీశ్వరులు యీ యాత్రలకు ఎంతో గౌరవంగా తీసుకెళ్ళి, అతనిచేత ఒక్క రూపాయి అయినా ఖర్చు చేయనీయలేదు. ప్రతి క్షేత్రంలోనూ అతనినెంతో ప్రత్యేకంగా గౌరవించి ముఖ్య అతిధిగా చూచుకొనేవారు. రాజులు, మహారాజులు, జాగీర్దారులు, పెద్ద పెద్ద ప్రభుత్వోద్యోగులు, (శ్రీమంతులు అతనికి ఘనంగా స్వాగతమిచ్చి, చక్కగా అలంకరించిన ఏనుగులమీద, పల్లకీలలోనూ తీసుకువెళ్ళి వారి పరిసరాలలోని “పుణ్యక్షేత్రాలను చూసేవారు. అదంతా బాబా అనుగ్రహమేనని తెలిసిన అతడు ఎక్కడికెళ్ళినా సాయి మహిమనే వెల్లడి చేసేవాడు.

*సాయి తత్త్వం అర్థం చేసుకుంటే చాలు*

త్యాగం అనేది సాయి తత్వములలో ముఖ్యమయినది..
త్యాగనిరతి సాయి యొక్క పరిపూర్ణ తత్వము.

*ఒక పరి షిరిడీలో ప్రవేశించిన*
ప్లేగు వ్యాధిని స్వీకరించి షిరిడిలో* నివసించే ప్రజలను కాపాడాడు.
సోదరి సమానురాలు అయిన ఆమె కుమారుడు తాత్యాకు బదులు తన ప్రాణం తృణప్రాయంగా సమర్పించినాడు. ఋణముపట్ల బాబా తత్వము నిక్కచ్చిగా యుంటుంది. నిన్ను ఎవరు అడగలేదు, ఇస్తాను అని ఇవ్వకపోతే అది రుణమే. రుణము నుంచి వెంటనే విముక్తులు కావాలి అనేవారు.

*నేను లేని చోటు లేదు అన్నారు*. శ్రద్ధ, సబూరి అనే రెండు నాణెములు ఇవ్వమని అడిగేవారు. ఏ వ్యక్తి అయినా ప్రవర్తనలోగాని వేష భాషలలోగాని ఆడంబరములకు పోకుండా సాదా సీదాగా ఉండాలి అనేవారు.
*ఆడంబరాలకు ఆయన చాలా దూరం*.

*ప్రతి ఒక్కరిలో ఆకలి బాధ గమనించి* తీర్చుట ఆయన తత్త్వం. పశుపక్ష్యాదులకు కూడా ఇది వర్తింపచేసేవారు.
ఎవరికి ఎంత ప్రాప్తమో శ్రీ సాయినాథునికి తెలుసు.

*అంతా నీకు తెలుసు బాబా సర్వం నీవే అని అంటారు* కాని చెబితే వినేవాడు ఏడి అని ఒక సందర్భములో బాబా అన్నారు.

*ఒక పేద బాహ్మణుడు శ్రీసాయినాథుని కలిసి* తాను పేదరికంలో ఉన్నానని తనను పేదరికం నుంచి రక్షించమని కోరాడు. అపుడు బాబా ఈ పేదరికం నువ్వు అనుభవించక వేరే దారి లేదు అని బాబా చెప్పగా ఆ బ్రాహ్మణుడు వినలేదు.

నేను ఇచ్చినా నీకు నిలవదని చెప్పినా ఆ విప్రుడు మాట వినలేదు. సరే నీ ఖర్మ అంటూ ఆ విప్రుని చేతికి ఒక మూట ఇచ్చి ఇంటికెళ్లి నీవు, నీ భార్య కలిసి ఈ మూట విడదీయండి అని చెప్పగా సమ్మతించిన బ్రాహ్మణుడు ఆ మూట తీసుకొనెను. ఉత్సాహము ఆపుకోలేని ఆ బ్రాహ్మణుడు మూట విప్పగా అందులో విప్రునికి మాంసం ముద్ద గోచరించెను. ఆ మూటను నదిలో విసరగా బంగారుముద్దగా మారెను.
నీట మునిగెను. బాబా సెలవిచ్చినది అక్షరాలా నిజమని భావించి విప్రుడు గృహోన్ముఖుడు అయినాడు.

పై చెప్పబడిన అంశములు సాయి అనే మహాసముద్రంలోని కొన్ని నీటి బిందువులు మాత్రమే. సాయితత్వం పూర్తిగా అవగాహన చేసుకున్నవారు అరుదు. ఆయన తత్వం అన్వేషిస్తూ వున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు....


*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార