*వేదములు వల్లించిన మహిషము*..

దున్నపోతు వేదములు వల్లించుటయా? ఇది నిజమా? అవును నిజం, ముమ్మాటికీ నిజమే. ఇలా పలికించినది ఎవ్వరో కాదు పాండురంగని అంతరంగిక భక్తులు జ్ఞానదేవ్. ఒక సందర్భములో పాండురంగడే *"నన్ను జ్ఞానదేవుని వేరు చేసి చూడ వద్దు. ఇద్దరం ఒక్కటే*" అని నామదేవుకు చేపుతాడు.

ఒక పర్యాయము వేదపండితులకు జ్ఞానదేవులకు ఒక విషయంలో భేదాభిప్రాయాలు రాగా *"జ్ఞానదేవ్ అని నీవు ఎందుకు పేరు పెట్టుకున్నావు*?” అని ప్రశ్నించగా జ్ఞానదేవుడు *"అన్నిప్రాణులలోను ఉన్న చైతన్యము ఒక్కటే అటువంటప్పుడు నేను జ్ఞానదేవ్ అని పేరు పెట్టుకుంటే తప్పేమిటి*?" అని ప్రశ్నించగా ఆ పండితుడు ఒక మహిషమును, చూపించి దీనిలోను నీలోను ఉన్న చైతన్యము ఒక్కటేనా? అని ప్రశ్నించగా జ్ఞానదేవులుఅవును అని సమాధానమిచ్చెను.

అయితే ఈ మహీషమును మాట్లాడించు అనిచెప్పగా మాట్లాడటమేమిటి వేదములే వల్లిస్తుంది అని చెప్పి తన హస్తమును ఆ మహీషముపై పెట్టగానే ఆ మహిషము లయబద్దంగా వేదములు పఠించెను. అదిగాంచిన ఆ పండితుడు జ్ఞానదేవుడు సామాన్య మానవుడు కాదని తెలుసుకుని అతని పాదములపై పడి క్షమాపణలు వేడిరి.

జ్ఞానదేవ్ ఉపన్యాసాలకు అసంఖ్యాక భక్తులు హాజరై శ్రద్ధా,భక్తులుతో వినెడివారు.
జ్ఞానదేవ్ ఉపన్యాసములు సచ్చిదానంద బాబా గ్రంథస్తం చేశాడు దానికి *భావార్థ దీపిక* అని నామకరణం చేశాడు. ఆ తరువాత కాలంలో దానికే *జ్ఞానేశ్వరి* అని పేరిడిరి. సాయిబాబా తన భక్తులను జ్ఞానేశ్వరి చదవమని చెప్పి అనేకమందిచే పారాయణ చేయించారు కూడా.

*ఈశావాస్యోపనిషత్తు*..

ఈశావాస్యోపనిషత్తులో మనిషికి ఆత్మజ్ఞానం కలిగించు శ్లోకములు ఉన్నవి. ఒకసారి
దాసుగణు ఈ ఈశావాస్యోపనిషత్తుకు మరాఠీ వ్యాఖ్యానం చేయదలచిన కొన్ని శ్లోకాలను తర్జుమా చేసాను. కానీ అవి అతనికి ఏ మాత్రము సంతృప్తి కలగలేదు. దానిలోని భావం గ్రహించవలెనన్నా సద్గురు కృప అవసరమని గ్రహించి బాబా చెంత కేగి అతడు సందేహం చెప్పగా *"నీ తిరుగు ప్రయాణంలో కాకాసాహెబ్ పనిపిల్ల నీ సంశయమును తీర్చును*"అని చెప్పెను.

అది వినిన దాసగణు బాబా అనుమతి పొంది తిరుగు ప్రయాణమై కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసను. ఆమరుసటి రోజు ఉదయాన కాక పనిపిల్ల తన పనులు చేసుకొనుచు సుశ్రావ్యమైన కంఠముతో ఒక చక్కని పాట పాడసాగెను. ఆపాట ఒక ఎఱ్ఱని చీర గురించి మరియు దాని చేతిపని గురించి. పనిమనిషి కట్టుకున్నది చింకి బట్టలు మాత్రమే. కాని వర్ణించినది ఒక సుందరమైన చీర గురించి.

ఆమర్నాడు రావుబహదూర్ ప్రధాన్ ఒక కొత్తపంచెల జతను దాసగణు బహుకరించ గా దాసగణు ఆ పనిపిల్ల కూడ ఒక చీర నివ్వమనగా అతను ఆమెకు కూడా ఒక చీరను బహుకరించను. ఆ చీర కట్టుకొని ఆ పని పిల్ల సంతోషముతో ఆడి, పాడెను. ఆ తరువాత రోజు ఎప్పటి వలెను చింకి గుడ్డలు కట్టుకొని పని చేయసాగెను.

అయినను ఆమె ఆనందంలో ఏ మాత్రమే మార్పులేదు. మొదట ఆమె చింకి గుడ్డలను కట్టికొనినను మంచిచీర గురించి సంతోషంగా పాడెను. కొత్త చీర లభించిన పిదప దానిని ధరించినను అంతే సంతోషంగా నుండెను ఆ తరువాత ఆ చీరను పెట్టెలో దాచి పెట్టి చింకిబట్టలు ధరించినను ఆమె సంతోషంగానే ఉండెను. దీనికి కారణమేమిటి? చీర? కాదు. పనిపిల్ల మనస్సు, ఉన్నప్పుడు, లేనప్పుడు, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలనే భావాన్ని చక్కగా తెలియచేసెను.

ఈశావాస్యోపనిషత్తు యొక్క భావము ఇదే . కొంతమంది వేద పండితులు బాబా
ప్రతినిత్యము ఎంతో మందికి కళాకారులను ఆదరించి వారికి బహుమతులు ఇచ్చు నని గ్రహించి బాబా చెంతకు వెళ్ళి బాబా ముస్లిం అని భావించి పరబ్రహ్మమును దక్షిణను అడుగుచూ వేదములు వల్లించ సాగిరి. మధ్య మధ్యలో వారు మరచిపోయిన వేదభాగముల ను బాబా వారికి గుర్తుచేయగా వారు సిగ్గుపడిరి. బాబా వారి గర్వమును గుర్తించి *"మీరూ పొగిడిన ఆ పరబ్రహ్మనే సంభావనను అడగండి*" అని చెప్పగా వారు సిగ్గుతో తలదించుకోగా బాబా వారికి భారీగా భావన ఇచ్చి వారిని సత్కరించి పంపెను.

Source - మున్నలూరి బోస్,
ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.


శ్రీ సాయిబాబా ఉండే స్థానం తెలుసుకోవటం, సాయిబాబా ఇచ్చిననుభవం తెలుసుకోవటం ఒక్కటేనా ?

కాదు అనే మాటనే చెప్పు కోవాలి. బాబా ఉండే స్థానం హృదయమని తెలిసినా, మనం అక్కడ పరీక్షించుకోకుండా ఎక్కడెక్కడో వెదుకుతున్నాం. అంటే ఇంకా దేనికోసమో వెంపర్లాడుతున్నామని, ఇంకా ఏదో *నాది* వుండి పోయింది అంటూ వెతుకులాడుతుంటాము అని అర్ధం. శ్రీ సాయి ఉండే స్థానం తెలియగానే సరిపోదు(మన హృదయం లో). మనలోనే ఉన్న సాయి సద్గురుమూర్తిని అనుభవించాలి. నిరంతరం ఆ సాయిభావనలో ఉండాలి. సాయిభావన అంటే మనం సాయిబాబాతో సమానమని కాదు. మనం బాబాలో ఒక భాగమనే భావన మనలో కలిగి ఉండాలి. సాయిబాబా కోసం వెదికేవారికి ఆ సాయి తమ హృదయంలోనే ఉన్నదన్న సత్యం తెలిస్తే స్వాంతన వస్తుంది. వెతుకులాట తగ్గుతుంది. సర్వం సాయి మాయం అనే భావన మనల్ని సద్గురు చరణములలో భాగంగా చేస్తుంది. అలాగే ఈ అనంతం సాయి అనే భావన నేరుగా మనని సాయిగా మార్చదు. అహంభావన రహిత సాయిస్థితిని కల్పిస్తుంది.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

*నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ అవస్థ రక్షకరం*


? బబాగారి లీలలు, చేష్టలు అంతు పట్టేవి కావు. ఎంతో శ్రమిస్తేనే గాని అది కూడా అంతా తెలిసేది కాదు. కొంత వరకు మాత్రమే అర్ధం అయ్యేది.

? సయిబాబా గారి చరిత్రలో మనం చూసే ఉంటాం, బాబాగారు అందరి వద్ద నుండి దక్షిణ అడిగేవారు కాదని. అడగకుండా ఇస్తే పుచ్చుకొనేవారు కాదని.

?అది చూడటానికి బాధకరంగా ఉన్నపటికీ దాని అర్ధం వేరు.

? కశీరాం అనే భక్తుడు సాయిబాబా గారికి పరమ భక్తుడు. బాబాగారికి మొదట్లో తెలన్నీ లేదా కాషాయం రంగు గల కఫనీ వాడేవారు. ఈ భక్తుడు ఆకు పచ్చని రంగు గల కఫనీ ఇచ్చారు. కానీ బాబాగారు ఎక్కువగా తెల్లనిదే వేసుకొనే వారు.

? సయిబాబా గారు ఈ భక్తుడు నుండి ఒక పైస లేదా రెండు పైసలు మాత్రం అడిగేవారు.

? కనీ కాశీరాం ధనం అతని వద్ద ఉండుట చేత బాబాకు అవసరం వచ్చినపుడు డబ్బు సంచిని సాయి దగ్గర ఉంచే వారు. చిత్రం,, బాబాగారు ఒక్కో రోజున కాశీరాం ధనాన్ని ముట్టే వారు కాదు !.

? కశీరాంకు మాత్రం తన వద్ద నుండి దక్షిణను బాబాగారు తీసుకోవాలి అని అనుకునేవారు. సాయి తీసుకొనపోతే చాలా బాధ పడి, తనకళ్ల నుండి నీరును కూడా కార్చేవారు కాశీరాం.

? ఇది చూడటానికి బాధగానో లేదా ఇబ్బందిగానో కనబడినను, పరమార్థం వేరు.

? డబ్బులు ఇచ్చే వానికి "నాకు ఇచ్చే శక్తి వున్నది అనే అహంకారం చోటు చేసుకుంటుంది. బాబాగారి ఉద్దేశ్యం వేరు. భక్తుని పరమార్ధానికి అడ్డు ఏదయినా దానిని వేర్లతో సహా పెరికివేయాలి.

? అదే కాశీరాంకి కొంత కాలం గడచిన పిదప, డబ్బులు లోటు అయ్యాయి. ఎప్పుడూ ఒకే లాగా వుండదుగా జీవితం. ఆ సమయంలో బాబాగారు తరచూ కాశీరాం నే దక్షిణను అడిగేవారట. డబ్బు లేదని బాధగా చెప్పేవాడు కాశీరాం. అయినా సరే వ్యాపారిని అడిగి మరి తెమ్మని వత్తిడి చేసేవారు బాబాగారు. ఈ లీల దేని కోసం? కాశీరాం అహం తొలగించుటకు. ఇప్పుడు అతనికి ఇచ్చే శక్తి లేదు.

? తన అహం తొలగిన పిదప కాశీరాంకి మళ్ళీ మంచి రోజులు ఇచ్చాడు బాబాగారు.

? దన్ని బట్టి ఇచ్చే శక్తి ఎవరి కుంది? సాయిబాబా గారికి మాత్రమే. నేను ఇవ్వగలను అనే అహం వున్న రోజులలో బాబాగారు ముట్ట లేదు. కారణం భక్తుని పరమార్దానికి అడ్డు ఏది ఉండరాదని. అతనికి అడ్డు తనకు ఇచ్చే శక్తి ఉందను కోవడమే కానీ ఆ శక్తి బాబాగారిది అని గుర్తించకపోవడమే. అన్నిటిని సృష్టించింది పరమాత్మ సాయి అయినపుడు డబ్బు ఎవరు సృష్టించారు? సర్వం సాయిబాబాగారె కదా. డబ్బు వున్న మైకం వల్ల మరచిపోకూడదు. అదే కాశీరాం డబ్బులు లేని స్థితిలో ఉన్నపుడు బాబాగారు పదే పదే మరి అడిగారు. లేదంటే వ్యాపారివద్ద వెళ్లి తెమ్మన్నారు. ఒకప్పుడు డబ్బులున్న రోజులలో వున్న మనిషిని అతని దీన స్థితి లో వున్నపుడు అడుగుకొని మరి తెమ్మన్నారు బాబాగారు, , కారణం అతని గర్వం అణుగుటకు మరియు కష్టాలలో నైనా, సుఖాలలో నైనా పరమాత్మను మరువరాదని, అన్నిటికి మూలం మనం కాదు కానీ ఆ పరమాత్మ సాయి అని తెలుసుకోవడం కోసమే జరిపిన లీల.

? మనం ఎలా వుండాలో అర్ధం ఐనదనుకుంటాను.......

...... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార