మితిమీరిన కోరికలు,వ్యామోహాలే మాయకు ప్రతినిధులు

మనసుకూ రూపం లేదు , మాయకూ రూపంలేదు , ఈ రెండూ సందర్భాన్నిబట్టి మనిషిని స్పందింపచేసి , ఆడిస్తుంటాయి ..

మితిమీరిన కోరికలు , వ్యామోహాలు సముద్రంలొ కెరటాల్లా ఎగసిపడుతున్నంతవరకు , మనసు
మాయకు దాసోహం చేస్తూ, మనిషిని ప్రవర్తింపచేస్తూంటుంది .. పుట్టిందే అనుభవించడానికి అనిపిస్తుంది ఒకవయసులో , వయసు మీదపడ్డాక
అణగారిన శరీరం అంటుంది పుట్టి సాధించింది ఏమిటని విరక్తిభావంతో ..
జన్మ కారణం అర్థంకానిదే , మనసు జన్మ రాహిత్యానికి అన్వేషణలోపడదు

అంతఃపురంలో నాలుగుగొడలకే బావిలొ కప్పలా పరిమితమయిన సిద్ధార్థుడు , ఒక్కసారిగా ప్రపంచాన్ని చూసి చలించిపోయి , విరక్తితొ సత్యాన్వేషణలో పడిన కారణంగా , సిద్ధార్థుని , గౌతమ బుద్ధుడిగా ,మహా జ్ఞానిని చెసింది .. విశ్వామిత్రుడు ఒక రాజుగా ఎన్నో సుఖాలను అనుభవించాక , విరక్తిపుట్టి , కటోర తపస్సుకి కూర్చుండచేసింది ..

ఏదో పరిస్థితుల కారణం మనిషిలో విరక్తిభావం మొలకెత్తి , సత్యాన్వేషణకు గురిచేసినా , నిలకడలేని మనసు , గత సంస్కారాలను గుర్తుచేస్తూనే ఉంటుంది .. ఎంతో పట్టుదలగా , నిష్టతో కటిన నియమంతో చలించక కూర్చున్న విశ్వామిత్రుడు కూడా గత వాసనల ప్రబావం మేనక అందాలకు లొంగిపోకతప్పలేదు ,, రాజర్షిగా గుర్తింపుపొందాలన్న తపన ఉన్నంతవరకు , ఆయనకు ఆ యోగ్యత సిద్ధించలేదు .. నిశ్చల సమాధిస్థితికి ఎదిగినతర్వాతనే , లొకం ఆయనకు రాజఋషిగా పట్టంకట్టింది ...

సంకల్పాలు ముందుకునెట్టే ప్రయత్నం చేస్తున్నా , మనసు గతవాసనలను వీడనంతవరకు , మాయ మేనకలా రెచ్చగొడుతూనేఉంటుంది .. నేను , నేను అన్న భ్రమలు తొలగేంతవరకు చెదరిన పుట్టనుండి చీమల్లా ,
మితిమీరిన కోరికలు , వ్యామొహాలు విజృంభిస్తూనేఉంటాయి ,,

ఏనుగు వెలగపండును మింగి , గుజ్జును జీర్ణంచేసుకుని , వెలగ టెంకను ఏమాత్రం చెదరకుండా విసర్జిస్తుంది .. రాముఁడు పాలించిన రోజుల్లోనే రావణాసురుడు విజృంభించినట్టు లొకంలో మంచితోబాటు చెడూ నీడలా కాచుకొనేఉంటుంది .. ఒక సద్గురువును చేరి కొరికలతో చేతులు చాచడం ఎంతో తేలిక .. ఆ సద్గురువు దివ్యప్రబోధాలను నిలకడగా విని , ఏనుగు గుజ్జుని జీర్ణంచేసుకుని, టెంకను మాత్రమే విసర్జించినట్టు , జన్మకర్తవ్యాన్ని గుర్తించి , నిలకడైన మనసుతో ఆకర్షణలకు దూరంజరగడం ఎంతో కష్టం ...
మితిమీరిన కోరికలు , అతి వ్యామోహాలకు మనసు మాయతో విజృంభిస్తుంది , ఆశయాలకుతగ్గట్టు అసత్యప్రచారాలూ ఆకట్టుకోడం మొదలుపెడతాయి .. ఏది సత్యం , ఏది నిత్యం అన్న స్ఫురణ మనసుకు తోచనంతవరకు , ఆవరించిన మాయ మేనకలాంటి బాధగురువుల రూపంలో ఆకర్షిస్తూనే ఉండగలవని పెద్దలమాట ...

సర్వం శ్రీగురు చరణార్పణమస్తు

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార