సాయిబాబా సన్నిహిత సేవకులలో మొదటివాడయిన మహాల్సాపతి కి సాయి తో గల అనుభవాలు.*

ఒకనాటి సాయంత్రం మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే సాయి , “ఈరోజు నీకిద్దరు దొంగలెదురవుతారు, జాగ్రత్త ” అన్నారు. తరువాత అతనికి తన పక్క ఇంటి దగ్గర ఒక పాము, అతని ఇంటి గడప లో మరొక పాము కనిపించాయి. అతడు వాటినేమి చేయకుండా తప్పుకుని వెళ్ళిపోయాడు. అలానే మరొక రోజు సాయి అతనితో, “నీవు మల్లి వచ్చేప్పుడు దీపం తెచ్చుకో , మశీదు గేటు వద్ద దొంగ ఎదరవుతాడు” అన్నారు. ఆ తరువాత ఆయన చెప్పినట్లు చీకటి పడ్డాక అతడు లాంతరు తీసుకుని వస్తుంటే మశీదు గేటు వద్ద ఒక పాము ఎదురయ్యింది.

మరొకసారి బాబా అతనితో , “ఈరోజు ఖండోబా మందిరం లో ప్రమాదం జరుగనున్నది.అయినా భయం లేదు. నేనున్నాను.” అన్నారు. ఆరోజతడు ఖండోబా పూజ చేస్తుండగా అతని భార్య , కుమార్తె అకస్మాత్తు గా జబ్బుపడ్డారని కబురొచ్చింది. అయినా అతడు చలించలేదు అతడు మశీదు కి చేరగానే సాయి , “రోగులని మంచం లో నుండి కదలవద్దని చెప్పు ” అని చెప్పి మశీదు చుట్టూ తిరుగుతూ సటకా తో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తూ , “రా, నీ శక్తి ఎంతో నేను చూస్తాను. నీవు వచ్చావో ఈ సటకా తో నిన్నేం జేస్తానో చూడు” అన్నారు. అదే ఆ రోగులకు బాబా చేసిన చికిత్స . ఆరోజు ఒక వైద్యుడు వచ్చి రోగులకు మందు వేయమన్నాడు. అయినా బాబా అనుమతించలేదు .అయినప్పటికీ కొద్దిసేపట్లో ఆ ఇద్దరికీ జబ్బు నయమయింది.

సకాలం లో మహాల్సాపతి కుమార్తెలకు వివాహాలయి కాపురాలకి వెళ్లారు. ఒకసారి ముగ్గురు మామగార్లు ఒక శుభ సందర్భం లో ఒక చోట చేరి మహాల్సాపతి ని కూడా రమ్మని కబురు చేసారు. నిజానికి వారెన్నడు అతనిని గౌరవించలేదు. కాబట్టి అతను సంతోషము తో ఊరుకి వెళ్ళడానికి అనుమతి ని కోరాలని మశీదు కి వచ్చాడు. అతడేమి చెప్పక ముందే బాబా , “నీవు వెళ్లదలచుకుంటే వెళ్ళు. కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు”. అన్నారు. కానీ ఆడ పిల్లల తండ్రి గా అతడు వెళ్ళకతప్పలేదు . ఇతడు వెళ్లేసరికి అతడి కోసం కొంచమయిన వేచి చూడక ఆ ముగ్గురూ ఆనందంగా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారు. అతనిని సరిగ్గా పలకరించలేదు కూడా. అతడెంతో చిన్నబుచ్చుకుని తిరిగి వచ్చాడు .

ఒకసారి మహాల్సాపతి కి ఖండోబా దివ్య దర్శనమిచ్చి పండరీపురం లోని విఠలుని దర్శించమని ఆదేశించాడు. ఇంట్లో తిండి కూడా గడవని అది తనకెలా సాధ్యమో మహల్సాపతి కి అర్థం కాలేదు.కానీ కొన్నిరోజుల్లో ఒక శ్రీమంతుల కుటుంబం అతన్ని పండరి పంపించారు. అక్కడ జనం ఎక్కువ గా వున్నారు. విఠలుని దర్శనానికి పూజారులు కోరిన కాసులు తన వద్ద లేవు. అతడెంతో కష్టపడి జనం లో తోసుకుంటుంటే, అతడి ముఖం లో ఆ పూజార్లకి ఖండోబా దర్శనమైంది . వారు వెంటనే అతన్ని విఠలుని దర్శనం చేయించారు. అలానే అతడొకసారి కొందరు భక్తులతో కలిసి జాజూరి యాత్ర కి వెళుతుంటే, పోలీసులు వారి పాస్ లు చూయించమని అడిగారు. ఒకరివద్ద మాత్రం అది లేదు. గ్రామ కరణం వద్దకి వెళ్లి తీసుకురావడానికి వెళ్లగా, అతడు ముందు తన ఇంట కట్టెలు కొట్టమని చెప్పి గొడ్డలి ఇచ్చాడు. అతడు కట్టెలు కొట్టబోగానే ఆ గొడ్డలి విరిగింది. అది ఖండోబా లీల అని గుర్తించి ఆ కరణం అతడికి పాస్ ఇచ్చి పంపేశాడు.

*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?*

ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్నభోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను. ఆకుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా యిట్లనెను". తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము". ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె యిట్లు జవాబిచ్చెను. 'బాబా! నేను నీ కెట్లు భోజనము పెట్టగలను? నా భోజనముకొర కితరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చిభోజనము చేయుచున్నాను.' అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను". నీ విచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకుపూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము". ఈ యమృతతుల్యమగు మాటలు విని యామె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొనిపోయెను. ఆమె యానందమునకు అంతులేకుండెను.

నీతి
'భగవంతుని జీవులన్నిటియందు గనుము' అనునది యీ యధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణమునను ఇతరానేకముల మూలమునను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణరూపమున నెట్లుంచవలెనో యనుభవపూర్వకముగా నిర్థారణచేసి యున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను భోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను.
*_ఓం శ్రీ సద్గురు సాయినాథయా నమః_*
*_అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*_ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి_*

*_నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

నవవిధ భక్తి మార్గాలు


మనము నవవిధ భక్తి కోసం చాలా సార్లు చదువుకున్నాము ....
ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకుందము......

_*నవవిధ భక్తి మార్గాలు, వాటి ఉదాహరణలు*_

*'శ్రవణం' ...*
*కీర్తనం' ...*
*'స్మరణం' ...*
*'పాదసేవనం' ...*
*'అర్చనం' ....*
*'వందనం' ...*
*'దాస్యం' ...*
*'సఖ్యం' ..*
*'ఆత్మనివేదనం'*
వంటి తొమ్మిది భక్తి మార్గాలు చెప్పబడ్డాయి.

వీటికి సంకేతంగానే షిర్డీ సాయిబాబా.. "లక్ష్మీ భాయిషిండే" అను ఆమెకు తొమ్మిది నాణేలను అనుగ్రహించారు !
1.. శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు, ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
2.కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, దాసగణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
3. స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
4. పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
5. అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
6.వందనం: ప్రణామం చేయుట
7.దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు
8.సఖ్యం: అర్జునుడు
9.ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ*

*నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ అవస్థ రక్షకరం*

"కులం కాదు గుణం ప్రధానం*"

భగవంతుని అనుగ్రహం పొందడానికి కులం కాదు గుణమే ప్రధానం. ఏ కులస్తుడైనా, ఏ మతస్తుడైనా అందరూ దైవానుగ్రహానికి అర్హులే.

*"కన్హోపాత్ర*"
పాండురంగ అంకిత భక్తులైన చోఖామేళా,దామాజీ జన్మించిన మంగళవేద్య గ్రామంలో జన్మించిన భాగవతోత్తమరాలు కన్హోపాత్ర. ఈమె వేశ్య ఇంట జన్మించెను. ఆమె సౌందర్యము వర్ణించుట అనితరసాధ్యం. ఆమె ఎంత సౌందర్యవతియో అంత పరమ భక్తురాలు. భక్తి తప్ప అన్యమును ఆశించనిది ఆమె సౌందర్యం గురించి నోట ఈ నోట విన్నా ఆదేశపు రాజు తన ఆస్థానానికి ఆహ్వానించగా ఆమె తిరస్కరించి తన జీవితం భగవంతునికే అంకితమని నిక్కచ్చిగా చెప్పాను. ధనానికి ఆశపడి మానాన్ని అమ్ము కున్నది కాదు కన్హోపాత్ర.

ఒకసారి ఏకాదశి ఉత్సవానికి పండరీ వెళుతున్న భక్త
బృందంతో కన్హోపాత్ర కూడా పండరికి బయలుదేరింది. ఆమె సౌందర్యానికి అందరు అచ్చెరు వొందిరి. రాజాజ్ఞ ప్రకారము ఆమెను బంధించి రాజప్రసాదా నికి తీసుకువెళ్ళటానికి భటులు పండరీ పురమునకు రాగా అది తెలుసుకున్న కన్హోపాత్ర వారితో *"ఒక్కక్షణ మాగండి ఆఖరి సారిగా పాండురంగని దర్శించుకోని మీతోవస్తాను*" అని చెప్పి ఆలయము లోనికి వెళ్లి *"రంగా! నన్ను ఇంతటి సౌందర్యవతిగా ఎందుకు పుట్టించావు? నేను నీ భక్తి తప్ప అన్యమెరుగను. నన్ను కటాక్షించు. నన్ను నీలో ఐక్యం చేసుకో*" అని ఎలుగెత్తి పాండురంగని వేడుకోగానే రంగడు కరుణించాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు.

ఆమె ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. ఆమె మోము మీద చిరునవ్వు మాత్రం చెదరలేదు. అదిగాంచిన రాజ భటులు, గుడి భక్తులు కూడా ఆమెభక్తి ప్రపత్తులను కొనియాడారు.ఆమె శరీరాన్ని పాండురంగని ఆలయానికి దక్షిణ భాగాన సమాధి చేశారు. అక్కడ ఒక వింతచెట్టు మొలిచింది అది ఏమిటో ఎవరికీ తెలియలేదు. దానిని తరటి చెట్టు అంటారు. ఇప్పటికి ఆ చెట్టు భక్తులు చూడవచ్చును.

*"ద్వారకామాయి, షిరిడీ*"..
బాబా చెంతకు గూడ అనేక కులాల వారు, మతాల వారు అనేక వృత్తుల వారు, ధనికి, బీద అసంఖ్యాక జనులు విచ్చేసి ద్వారకామాయిలో బాబాను దర్శించెడి వారు. అందులో వేశ్యలు కూడా ఉండేవారు. బాబా వారిని కూడా ఆశీర్వదించే వారు. బాబా తన వద్దకు వచ్చేవారిలో ఎంత భక్తి ఉన్నదో చూసే వారే కానీ వారు ఏ కులస్తులు, మతస్తులు అని విచారించే వారు కాదు.

ఒక రోజు ఒక వేశ్య బాబా సశరీరులుగా సేవించి తరించిన వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్ (సాయి శరణానంద్) తో పాటు కోపర్గాం నుండి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకోగా బాబా ఆమెను ఆశీర్వదించారు. బాబా సమకాలికుడు గొప్ప ఔలియా నాగపూర్ నివాసి అయిన తాజుద్దీన్ బాబా చెంతకు కూడా వేశ్యలు వచ్చారు. ఒక రోజు ఒకవేశ్య అక్కడకు వెళ్ళి *"ఇక్కడ అంతా పుణ్య జీవులే ఉన్నారు పాపులు ఉండే తీర మెక్కడో*?" అని పాడగా వినిన తాజుద్దీన్ బాబా *"మంచి వాళ్ళంతా అక్కడికే వెళ్ళండి, పాపాత్ములు, దుర్మార్గులు నా వద్దకు రండి*" అన్నారు ఆయన ఎంతటి కరుణామయుడు గదా!

వేరొక పర్యాయము తాజుద్దీన్ బాబా ఆకాశంలోకి చూస్తూ *"నావద్దకు వచ్చే వారి పాపాల గురించి వారిని ప్రశ్నించకండి వారి తరపున నన్ను అడగండి. నేనే దానికి బాధ్యత వహిస్తాను*" అన్నారు ఇదీ ఆయన కరుణ రస హృదయం. భగవంతుడు పుణ్యాత్ముల కంటే ఎక్కువ పాపాత్ములు కొరకే పరితపిస్తాడు. వారి గురించే భగవంతుని తపన. పాపాత్ములు కొరకే భగవంతుడు దివి నుంచి భువికి దిగి వస్తాడు. అది సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం.

Source :- మున్నలూరి బోస్,
ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

ఎదుటివారి ఈర్ష్య ద్వేషంను ఏ విధంగా స్వీకరించాలి....

విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి.

వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు
దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి.

తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు
దాని పని పట్టబోతాయి.

ఐనా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే..
ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న
ఆ జీవులన్నీ దాని నీడలోనే తల దాచుకుంటాయి.

అదేవిధంగా మన ఎదుగుదల చూసి ఈర్ష్య పడినవారే
నీ సాయం కోరతారు.

అప్పటివరకు మనం చేయవలసినది ఒక్కటే,
ప్రతీ విషయానికి నవ్వుతూ సమాధానం ఇవ్వాలి,
మన లోపల ఆ భావం ఉండకూడదు,
నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ,
ప్రేమ, క్షమ, ఓర్పు, తో ఉండాలి..

ఓం సాయిబాబా

*భక్తులకు సేవలు చేసిన భగవంతుడు*..!!

 

*భక్తులకు సేవలు చేసిన భగవంతుడు*..!!

భగవంతుడు ఎప్పుడు భక్తితో సేవలు చేయించుకోవడం కన్నా తనే నిజమైన భక్తులకు సేవలో చేయుటకు ఉత్సాహం చూపును. ఆ భక్తుడు నిస్వార్ధ భక్తుడు ఉండాలి. సమాజానికి మేలుచేసే వాడే ఉండాలి. భగవంతుడి యందు సంపూర్ణ విశ్వాసము గలవారై ఉండాలి. అటువంటప్పుడు భగవంతుడు దివి నుండి భువికి దిగి వచ్చే భక్తులకు సేవలు చేస్తాడు.

*"సక్కుబాయి*"..
పండరీపురానికి అతి సమీపమున గల ఒక కుగ్రామంలో సకల శాస్త్రపారంగతుడు,
భక్తితత్పరుడు అగు గంగాధరుడు, కమలాబాయి దంపతుల గారాల పుత్రిక సక్కు బాయి. తలిదండ్రులిద్దరూ భగవద్భక్తులే అగుటచేతను తన పూర్వజన్మ సుకృతం చేతను సక్కుబాయి పసి తనముననే భగవంతుడి యందు భక్తిప్రపత్తులు కలిగెను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది చందమున అంత చిన్నవయస్సులోనే భగవత్ సంకీర్తనలు విన్న వెనువెంటనే ఏడుపు ఆపి శ్రద్ధగా ఆలకించెడిది. సంకీర్తన పూర్తి కాగానే మరల ఏడుపు మొదలు పెట్టిడిది. ఈసంగతి ఆనోట ఈనోట ఊరంతా వ్యాపించి తండోపతండాలుగా జనం సక్కును చూడటానికి వచ్చేవారు.

సక్కును బాల్యమునందే తల్లిదండ్రులు పండరీపురమునకు తీసుకువెళ్ళగా పాండురంగని గాంచిన సక్కు తదేక దీక్షతో పాండురంగని చూచుచు ఆ ముగ్ధ మనోహరరూపము యొక్క దివ్యకాంతికి స్పృహతప్పి పడిపోయింది. కొంత సమయం తరువాత స్పృహలోకి వచ్చిన సక్కు తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళు టకు నిరాకరించగా ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తరువాత సక్కుబాయి భక్తి పూర్వముకంటే ద్విగుణీకృతమయ్యెను. అది గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసినచో మారునన్న ఆశ భావముతో కరవీర పురమునకు చెందిన మిత్రకాంత అనే అతనితో వివాహం జరిపించి అత్తవారింటికి పంపిరి.

అత్తవారి ఇంట్లో కూడా సక్కుబాయి వేకువజామునే పూజలు తన దీనచర్యను ప్రారంభించి పగలురేయి భగవన్నామ సంకీర్తనలతో కాలము గడిపెడిది. అదిచూసిన ఆమె అత్తగారు సక్కును అనరాని మాటలతోను హింసించుటయే గాక ఇంటిపని మొత్తం ఆ చిన్నారితోనే చేయించెడిది. సక్కు అత్తగారు దయాదాక్షిణ్యాలు లేని మనిషి. భక్తి అసలే లేదు. సక్కు ఆమె అత్తగారి ప్రవర్తనను ఏమాత్రం పట్టించు కోకుండగా భర్తయే ప్రత్యక్ష దైవమని తలంచి భర్త, అత్తమామల సేవలుచేస్తూ ఇంటికి వచ్చిన అతిధులను ఆదరిస్తూ గృహిణిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్థించెడిది.

ఒకరోజున సక్కుబాయికి బస్తాలనిండా జొన్నలు ఇచ్చి వాటిని విసరమనుటయే
గాక ఇరుగుపొరుగు వారి ఇళ్ళనుంచి కూడా జోన్నలు తెచ్చి విసరమని చెప్పి సక్కును ఒకగదిలో పెట్టి గదికి తాళమువేసెను. ఆరోజు ఏకాదశి, సక్కు ఉపవాస మున్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా సక్కుబాయికి భగవంతునిపైగ నమ్మకము వమ్ము కాలేదు. జగాలనేలే భగవంతునికి ఈ పిండివిసురుట ఒకలెక్క అని పాండు రంగని కీర్తించుచు సంకీర్తనలు చేయుచు నిద్రలోకి జారుకునెను. వెంటనే పాండు రంగడు ఆ జొన్నలన్నిటిని పిండిగా విసరేసరి. తెల్లవారిన తరువాత అత్తగారు గది తాళము తీసి చూడగా జొన్నలన్నిటిని పిండిగా విసరు గాంచి విస్తుపోయెనే కాని అది భగవంతుని లీల అని గ్రహించలేక పోయెను.

ఎప్పుడో చిన్నప్పుడు దర్శించిన పాండురంగని మరల దర్శించవలెనని, భూలోక
వైకుంఠము పండరీపురము వీక్షించవలెనని ఆమె కుతూహల పడసాగెను. ఒకసారి
పండరీపురము వెళ్లుచున్న భక్తబృందముతో కలిసి ఆమెకూడా పండరికీ యాత్ర చేయసాగెను. ఆసంగతి తెలుసుకున్న అత్తగారు ఆమెను ఇంటికి తీసుకువచ్చి గది లో ఒక స్తంభంనకు కట్టి వేసెను. అట్టు విపత్కర పరిస్థితుల్లో *"రంగా నీవే దిక్కు నిన్ను దర్శించని ఈ జన్మవ్యర్ధము*" అని చింతించచుండ పాండురంగడు సక్కు
వేషము ధరించి సక్కు దగ్గరకు వచ్చి సక్కుని బంధ విముక్తురాలిని చేసి సక్కుతో *"నీవు నన్ను ఈస్తంభమునకు కట్టివేసి నీవు పండరీపురం వేళ్ళు*" అనిచెప్పగా సక్కు పండరీపురం వెళ్ళి చంద్రభాగలో స్నానమాచరించి స్వచ్చమైన మనసుతో ఆలయ ప్రవేశంచేసి పాండురంగని దర్శించి పులకాంకిత అయ్యెను. తన చిరకాల వాంఛ నెరవేర్చి నందులకు పాండురంగనికి ధన్యవాదములు తెలిపి భక్త బృందము తో తిరగి ప్రయాణమవ్వగా మార్గమధ్యమున సక్కుబాయి స్వర్గస్తురాలయ్యెను.

ఆమెతో నున్న భక్తులు ఆమెకు అంత్యక్రియలు గావించి అస్తికలను సక్కుబాయి ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వగా ఇంట్లోని వారు గది తలుపుతీసి చూసి సక్కు స్తంభము నకు కట్టి ఉండుటచే వారు చెప్పినది నమ్మలేదు. అంతలోనే అసలు సక్కుబాయి
ఇంటికి రాగా ఆమె అస్తికలు తెచ్చిన భక్తులు, ఇంట్లోని వారు అందరూ ఇద్దరు సక్కు లను చూచి ఆశ్చర్యపడుచుండగ సక్కుబాయి తాను మరణించినది నిజమేననియు కాని పాండురంగని కృపవలన తాను బ్రతికితిని అని చెప్పెను. అంతలోనే సక్కు రూపములో ఉన్న పాండురంగడు మాయమయ్యాడు. కానీ సక్కుబాయి మాత్రం తన నిజరూప దర్శనము ఇచ్చెను.

*"తల్లికన్నా మిన్నసాయి*"..
మనందరకు సాయిబాబా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం ఆయనే. ఒక్కసారి
తల్లి కన్నా మిన్నగా సాయి తన బిడ్డను కాపాడును. సాయి షిరిడి వదిలి భౌతిక దేహంతో నీంగామ్ మరియు రహతా మాత్రమే వెళ్ళేడివారు. నీంగామ్ లో నానా సాహెబ్ దేంగలే గృహమునకు వెళ్ళేడివారు. ఒకసారి వర్షకాలంలో డేంగలే పొు లో కోతలు జరుగుచుండగా ఆ పని చేయుటకు కొంతమంది మగవారు కొంతమంది ఆడవారు గలరు. ఒక స్త్రీ ఆమె నెలల పాపను పొలమునకు సమీపంలో గల చింత చెట్టుకు బట్టను ఊయల వలె కట్టి అందులో పరుండబెట్టెను.

కోతపనులు జరుగుచుండగా ఆకస్మాత్తుగా భారి గాలివాన వచ్చెను. పని చేయు చున్న వారందరు దగ్గరనే ఉన్న గుడిసెలోకి పోయి తలదాచుకున్నారు. పసికందు తల్లి తనపాప సంగతి కొంత తడవు తర్వాత గుర్తు రాగా కేకలు వేయుచు చెట్టు చెంతకు వెళ్ళి చూడగ బాబా చేతులలో పాప ఉండెను ఆమెను చూసిన బాబా కోపోద్రేకముతో *"రండ, పాపను మర్చిపోయి ఎక్కడకు పొయ్యావు. ఇదిగో పాపను తీసుకో*"అని పాపను ఆమెకు అందించెను. అంత భారీ వర్షములోను బాబా గానీ, బాబా చేతిలోని పాప గాని, బాబా నిలబడిన ప్రదేశమంతయు ఏ మాత్రం తడవక పొడిగా నుండుట గాంచిన వారందరు పంచభూతములు బాబా అధీనమున నున్నవని గ్రహించిరి. అందుకే బాబా మనందరికి సాయిమాత అయినాడు.

*"మరణించిన వారిని బ్రతికించిన సాయి*"..
మాలన్ బాయి అనే చిన్నారి దామోదర్ రంగనాథ్ జోషి కుమార్తె. ఆమె క్షయవ్యాధి
బాధపడచుండెను. ఎన్ని రకాలైన వైద్యములు చేయించినను ఆమె వ్యాధి తగ్గు ముఖం పట్టకపోగా రోజు రోజుకు తీవ్రమవ్వసాగెను. ఆ చిన్నారికి బాబా అందు అచంచల విశ్వాసం గలదు. చివరిసారిగా బాబాని చూడాలని ఉందని తనను షిరిడీకి తీసుకు వెళ్ళమని కోరగా ఆమె ఆఖరి కోరిక తీర్చిన తన బాధ్యత అని భావించి కొంతమంది బంధువులో కలిసి ఆమెను షిరిడీకి తీసుకు వెళ్లిరి. వారిని చూడగానే బాబా ఉగ్రరూపుడై బండబూతులు తిడుతూ *"ఆ పిల్లను ఒక కంబళి పరుండ పెట్టండి. ఆమెకు కుండలోని మంచి నీటిని మాత్రమే ఇవ్వండి". అని చెప్పగా మాలన్ బాయిని దీక్షిత్ వాడాకి తీసుకువెళ్ళగా ఆమె బాబాయందు పూర్తి నమ్మకముండుటచే కంబళీపై పడుకొని మంచి నీటిని మాత్రమే త్రాగుచుండెను. ఈ విధముగా ఒక వారంరోజుల గడవగా ఒక రోజు మాలన్ బాయి స్వరస్తురాలయ్యెను. అందరూ దుఃఖించుచుండ ఆరోజు బాబా ఎంతో ప్రొద్దెక్కినను చావడిలో నిద్ర లేవ లేదు. బారెడు పొద్దెక్కిన తర్వాత బాబా నిద్రలేచి చేతిలో సటకా తీసుకొని సటకాను నేలపై కొట్టుచూ బూతులు తిడుతూ బయటకు వచ్చను. ఆక్షణములో మాలన్ బాయిలో కదలికలు మొదలయ్యెను. బాబా కూడా శాంతించను. ఆనాటి నుండి మాలన్ బాయి పూర్తి ఆరోగ్యవంతురాలయ్యెను. ఆ సంఘటనతో బాబా ఎంతటి
మహిమాన్వితుడో అందరూ గ్రహించారు.

Source :- మున్నలూరి బోస్,
ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార