"నీ పేరున వ్రాయించేసుకో !"

మనిషిలోని వాసనలు ,సంస్కారాలు చాలా విచిత్రమైనవి .భగవంతుని సన్నిధిని కూడా మరపించి ,తమ బుట్టలో పడవేసే వాటి ప్రభావం చూస్తే.."ఔరా ! అని ముక్కున వేలు వేసుకోక తప్పదు .

బాబా సశరీరంగా ఉన్న రోజులలో ,బాగా డాబుసరిగా ఉన్న ఒక వ్యక్తి టాంగాలో షిరిడీకి వచ్చాడు .ద్వారకామాయిలో శ్రీ సాయినాధుని దర్శనం చేసుకుని సగుణ మేరు నాయక్ నడుపుతున్న భోజనశాలకు భోజనము చేయడానికి వచ్చాడు .అక్కడ భోజనశాల లో ఉన్నవారితో ,తాను ఒక గొప్ప భూస్వామినని ,సాయిబాబాకు తనకున్న భూములలో చాలావాటిని బాబాకు రాసి ఇవ్వబోతున్నాని ,ఆ పని మీదే షిరిడీకి వచ్చానని చెప్పాడు .

అంతే !
ఆ వార్త ఒక్కసారిగా షిర్డీ గ్రామములో గుప్పుమంది .ఆ వార్త విని వెంటనే బాబా భక్తుడైన శ్యామా (మాధవరావ్ దేశపాండే )బాబా వద్ధకు వెళ్లి "దేవా ! ఒక భూస్వామి మీకు చాలా భూమి మీపేరున వ్రాసి ఇవ్వబోతున్నాడు .ఆ భూమిని నా పేరున వ్రాయించుకోమంటావా ? అని అడిగాడు .
అందుకు బాబా " సరే ! నీ పేరున రాయించుకో ! అని చెప్పారు .
అటువంటి ప్రశ్నయే తాత్యాకోతే పాటిల్ ,విరాగిణి అయిన రాధాకృష్ణ మాయి ,ఆలాగే మరికొందరు బాబాను అదే ప్రశ్నను అడిగారు .

అడిగిన ప్రతిఒక్కరికి "నీ పేరున వ్రాయించేసుకో !"
అని ఒకే రకమైన సమాధానం చెప్పారు .దానితో ఆ భక్తులందరూ భూస్వామీ అనబడే ఆ వ్యక్తి దృష్టిలో పడటానికి ,
అతని అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నాలు ప్రారంభించారు .శ్యామా ఒక అడుగు ముందుకేసి భోజనశాల యజమాని తో ,ఆ భూస్వామి భోజన ఖర్చులు తాను భరిస్తానని చెప్పాడు

ఈ విధముగా ఎవరికివారు ముమ్మర ప్రయత్నములో మునిగిపోయారు .చివరికి ఆ భూస్వామి అనబడే ఆ వ్యక్తి భూమిని బాబాకు కానుక గా వ్రాయవలిసిన రోజు రానే వచ్చింది .సదరు ఆ భూస్వామి అక్కడవారితో ,రిజిస్ట్రేషను వగైరా స్టాంపు పేపర్లు కొనడానికి వెళుతున్నాని చెప్పి ,పత్తా లేకుండా వెళ్లిపోయాడు .మరి షిర్డి దరిదాపులలో కనిపించలేదు .

అందరికీ నిరాశే మిగిలింది .ఆ వ్యక్తి చేసిన భోజనశాల ఖర్చులు శ్యామా కట్టవలిసివచ్చినది .బాబాకు ఆ వ్యక్తి భూమిని ఇచ్చే వ్యక్తి కాదని శ్రీ సాయిబాబాకు ముందే తెలుసు .అందుకనే అడిగిన వారందరికి
"నీ పేరున వ్రాయించుకో !అని చెప్పారు .అందరికీ అన్నీ ప్రసాదించే ఆ దేవాది దేవుడైన శ్రీ సాయినాధుని ప్రక్కన పెట్టుకుని ,వ్యక్తుల ప్రాపకం కోసం , వారిచ్చే సంపదల కోసం పాకులాడటం ఎంత అవివేకమో ఈ సంఘటన ద్వారా భక్తులకు తెలియ వచ్చింది .

ఆ విధముగా మనసు మూలల్లో దాక్కొన్న వాసనలను బయటకి తెచ్చి ,భక్తులకు వివేక వైరాగ్యాలను బోధించే శ్రీ సాయినాధుని సందేశం సాటిలేనిది .

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సచ్చరిత్ర - బాబా గారు ఇచ్చే సందేశములు.!

మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే. బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందుగాని నిలబడి , బాబా వెళ్ళి ఓస్తానని చెప్పి వెళ్ళండి. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి.

ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి. మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మన సమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు.
కాని నాకు, సమస్య అడగకుండానే జరగబోయే సంఘటన తెలియచేశారు.

బాబా లీలలు నిగూఢంగా ఉంటాయి.
ఈ రోజు 2009 సం.లో నాకు కలిగిన అనుభూతి గురించి వివరిస్తాను.
నేను చదువుకునే రోజులలో యెప్పుడైనా
డిక్షనరీ తీసి మూసిన పుస్తకంలో నుంచి యేదొ ఒక పేజీ తీసి యే మాట వస్తుందో చూసే వాడిని. ఇది నేను చాలా తక్కువ సార్లే చేశాను. యెప్పుడైనా పుస్తకాల ఎక్జిబిషన్ కి వెళ్ళినప్పుడు యేదొ పేజీ తీసి విషయము బాగుంటే వెంటనే కొనడం అలవాటు.

నా దగ్గర శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు వ్రాసిన శ్రీ సద్గురు సాయిబాబా జీవిత చరిత్ర - నిత్య పారాయణ గ్రంథం ఉంది. ఈ పుస్తకము నా స్నేహుతుడు యెప్పుడొ ఇచ్చాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఇంటిలో ఉన్నప్పుడు అతనికి నేను ఇటువంటి పుస్తకం ఇచ్చి పారాయణ చేయమని ఇచ్చాను. అతనికి బాబా పరిచయం ఈ పుస్తకము ద్వారానే అయింది మొదటిసారిగా. అప్పటినుంచి అతను తనకు తెలిసినవారికి ఇటువంటి పుస్తకం కొని ఇస్తూ ఉన్నాడు.

అసలు విషయానికి వస్తాను. ఈ పారాయణ పుస్తకం నా కంప్యూటర్ టేబులు మీదే పెట్టుకున్నాను. ఒకసారి 2009 మార్చ్ నెలకి ముందు ఈ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని యేదో ఒకపేజీ తీసి ఓపేజీలొ ఒకచోట వేలుపెట్టి కనులు తెరచి చదివాను.అది 97 పేజీ. అందులొ నేను వేలు పెట్టిన చోట ఇలా ఉంది>
" ఈ రోజు నీకు దుర్దినం. నీ ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త" ఇది చదవగానే ఇంక మిగతా పేరా చదవకుండా పుస్తకం మూసేశాను.

భయం వేసి మిగతాది చదవలేదు. ఇలా ఆ నెలలో చాలా సార్లు యెప్పుడు తీసిన ఇదే పేజీ ఇదే పేరా రావడం జరిగింది. యేమిటి ఇలావస్తొంది అనుకున్నాను. బాబా గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, కాని యేమిటి ప్రతీసారి ఇలా వస్తోంది అనుకున్నాను.అసలు విషయమేమంటే ఆ అథ్యాయంలో నానా సాహెబ్ డెంగ్లీ శ్రీ మాన్ బూటీని ఇలా హెచ్చరించాడు. బూటీ భయపడిపోయాడు.

తరువాత బాబా గారు బూటీని చూస్తూ "యేమిటి, డెంగ్లీ యేమంటున్నాడు? నీకు చావును సూచిస్తున్నాడా? భయపడకు థైర్యంగా ఉండు, నాకె ప్రమాదం లేదని అతనితో గట్టిగా చెప్పు. నువ్వు ద్వారకామాయి బిడ్డవు. " ఆ పేరాలో ఉన్న మొత్తము విషయము అది.ప్రతీసారి అదే పేజీ రావడానికి నేను ఆ పుస్తకాని ప్రతీరొజు పారాయణ చెయ్యటల్లేదు. మరి యెందుకని అదే వస్తోందొ నాకు అర్థము అవలేదు.

మార్చ్ నెలలో మా ఆవిడ బంథువులతో షిరిడి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి శ్రీప్రత్తి నారాయణరావు గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము పుస్తకము తెచ్చింది.
ఒకరోజు నేను ఇంతకు ముందు చెప్పిన పుస్తకములో యెప్పుడూ కుడివైపు పేజీ మాత్రమే చూస్తున్నాను, అనుకుని ఈసారి ప్రత్తి నారాయణరావు గారి పుస్తకము తీసాను. ఆ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని తెరిచి యెడమవయిపు పేజీ తీసి వేలు పెట్టి చూసాను.

అది 22 అథ్యాయములోని చివరి పేరా. అందులో కూడా పాము గురించి ఉంది. ఆ పేరాలో "పాములు, తేళ్ళతో సహ సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును " అన్న వాక్యములు ఉన్నాయి.14.03.2009 న శనివారమునాడు మా ఇంటిలో బాబా గారి విగ్రహము ముందు నిలబడి " బాబా నేను జ్ఞానిని కాదు, పుస్తకము తెరవగానే వచ్చే ఈ వాక్యముల అర్థము తెలియటల్లేదు, అంధు చేత ఈ రోజు నా కలలోకి వచ్చి దీనికి నివారణ చెప్పు" అని ప్రార్థించాను.

ఆ రోజున మా సత్సంగములోని ఒకరిని ఈ విషయము గురించి అడిగాను కాని వారు కూడా యెమి చెప్పలేదు.నేను స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నాను. అందులో నేను ఎస్.బీ. ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను. 16.03.2009 న మరలా శ్రీ ఓరుగంటి రామకృష్ణప్రసాద్ గారి పుస్తకము తీసి, కళ్ళు మూసుకుని పేజీ తెరవగా, మరల అదే విషయము వచ్చింది. ఆ రోజున నేను స్కూటర్ మీద మా నరసాపురము నుంచి 15 కి.మీ. దూరములో ఉన్న మొగల్తూరు బ్యాంక్ కి ఇన్సూరెన్స్ పని మీద వెడుతున్నాను.

నేను యెప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు సాయి నామస్మరణ చేసుకుంటూ ఉంటాను. అల్లా వెడుతుండగా సడన్ గా పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్ళడం, కింద రోడ్డుమీద యేదో పడడం చూశాను. నా బైక్ కి కొంచెము దూరములోనే పడింది. చూసేటప్పటికి అది పాము, రొడ్డుమీద పడి కొంచెం తలయెత్తి ఉంది. నేను

రోడ్డుకు కుడివైపున వెడుతున్నాను అది రోడ్డు మీద యెడమ ప్రక్కన పడింది. రోడ్డుకి యెడమవయిపు కాలవ, కుడివయిపు పంట పొలాలు ఉన్నాయి. నాకు శరీరంలో దడ పుట్టింది.

ఆ వేగంలో పక్కనుంచి వెళ్ళిపోయాను. డ్రైవింగ్ లొ కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే, అది నామీద కనక పడి ఉంటే? ఇది తలుచుకోగానే ఊహించడానికే భయము వేసింది. బాబా గారిని ఇలా ప్రార్థించాను, బాబా, నాకు ఇన్సూరెన్స్ పాలసీలు రాకపోయినా ఫరవాలేదు, ఈ రోజు నాప్రాణాల్ని, కాపాడావు, అదే చాలు అనుకుని నామస్మరణ ఆపకుండా
వెళ్ళాను. యే సత్సంగము ద్వారానయితే నాకు బాబాగారి తత్వము అవగాహనకు వచ్చిందో, ఆ సత్సంగానికి 116/- సమర్పించుకున్నాను. ఆయన చేసిన సహాయానికి 116/- కూడా తక్కువే, యేమిచ్చినా కూడా."

!!సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!

శిరిడీ....యాత్ర....

శిరిడీ చాలా మంది వెళ్లి వస్తున్నాము. రోజు పారాయణము చేస్తున్నాము.
అయిన నేటి *గుణములతో పోల్చుకుంటే* భక్తి కంటే వెళ్ళాం .... వచ్చాం..... అంతే.... అదే శిరిడీ....యాత్ర.......

1.పవితమైన షిరిడి లో మీ వస్తువులు ఏమైనా పోయింది అంటే కర్మ పోయింది అని సంతోషించాలి.

2.ఏది ఎంత వరకు ఉంటుంది ఎవరికి తెలియదు అలాంటప్పుడు ఇది నాది, నా వారు అని ఎలా అనుకుంటున్నారు. *నీ శరీరానికి నువ్వు శాశ్వతం కాదు.* ఎప్పుడు నీ మరణం నిన్ను తీసుకొని వెళుతుందో తెలియదు.

3. పవిత్ర మైన శిరిడీ భూమి మీద నిన్ను ఎవరు ఎన్ని మాటలు అన్న నువ్వు శాంతిగా ఉండు బాబా తప్పకుండా నీకు మేలు చేస్తారు.

4. పవిత్రమైన షిరిడీ భూమి పైన నమ్మకం తో అడుగు పెట్టాలి. బాబా తప్పకుండా కనిపిస్తారు.

5. నీ కర్మ బలంగా వున్నప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోలేవు. పైగా నీపక్కన వారికి లీల జరిగిన నువ్వు నమ్మలేవు సరి కదా..... కనీసం నీ మనస్సు కూడా తీసుకోలేదు.

6. ఎవరి రూపాయి అవసరమో వారి వద్దనే బాబా తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు నువ్వు ఇచ్చే ప్రయత్నము చేయాలి.

7.నీకు అర్హత నమ్మకం లేనప్పుడు నువ్వ ఎం చేసిన అది భగవంతునికి చేరుతుందా .......

8.* సాయిభక్తులు నిన్ను తిడుతున్నారు అంటే నీ కర్మభారం తగ్గింది అనుకోవాలి. అబ్దుల్లా ను బాబా వారు చాలా సార్లు తిట్టారు మాములుగా కాదు చాలా అసహ్యంగా తిట్టేవారు. కానీ ఆయన ఆ తిట్లను దీవెనలగా భావించారు.

*అబ్దుల్లా ప్రక్కన ఉన్నవారు అవి తట్లుగానే భావించి ఆ కర్మలను వారు అనుభవించారు. బాబా అన్న తిట్లను అబ్దుల్లా మంత్రం గా తీసుకున్నారు కనుక ఈరోజు అబ్దుల్లాను అబ్దుల్ బాబా పూజిస్తున్నాము. అవి తిట్లగా భావించిన వారు.....ఎం కర్మ అనుభవిస్తున్నారో.... మనము ఆ కర్మను చింతించిన..........మంచిది కాదు.

షిరిడీ యాత్ర చేసే భక్తుడు వందనీయుడే.


సుమారు 62 సం॥ ల క్రితం షిరిడీకి పోతూ దారిలో నున్న మన్మాడ్ స్టేషన్ లో దిగారు శ్రీ వి.వి.రాజగోపాల నాయుడు గారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. దిగ్ర్భాంతి చెందిన నాయుడు గారు "ఏమిటిదంతా! నీవెవరు? "అని ప్రశ్నించాడు అతనిని. ఆ వ్యక్తి " ఈ పాదాలు షిరిడీ వెళుతున్నాయి. నేను షిరిడీ వెళ్లేవెళ్లేపాదాలను గుర్తించగలను. " అని చెప్పి నాయుడు గారికి ఒక గొంగళి ఇచ్చి "దీన్ని సాయి సమాధి చెందక పూర్వము నాకు ప్రసాదించారు. నీవు షిరిడీకి వెళ్ళేవారికి సేవ చేయి అని స్వయంగా ఆదేశించారు. నేను రైల్వే కూలిని "అన్నాడు నాయుడు గారితో.

సాయి అనుఙ్ఞ లేకుండా ఎవరూ షిరిడీలో పాదం మోపలేరు. షిరిడీ కి పోయి సాయినాధుని, ఆయన తన పవిత్ర పాదాలతో పునీతం చేసిన నేలను దర్శించేవారు కూడా పవిత్రులే వారికి సేవ చేయటం కూడా అదృష్టమే.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార