*నీవే సాయిపరమాత్మ

మనిషి సాయిదేవుడైనప్పటికీ అతని దృష్టి సాయిబాబాయందు గాక అతడేర్పరచుకున్న స్వభావము,గుణముల నందు చిక్కుకొని ఉంటుంది.

సర్వ జీవకోటి సాయిదేవుని నుండి దిగివచ్చిన మనిషి మాత్రం సాయిదేవునితో కూడి, సాయిదేవుని సంకల్పము నిర్వర్తిస్తూ ఉంటే సాయిబోధలు, జ్ఞానము లభిస్తుంటాయి.

సాయిదేవుని సాన్నిధ్యము లో ఉన్న సౌలభ్యము ఏమిటంటే సంకల్పము, జ్ఞానము, క్రియ ఈ మూడు అతని నుండి మనకు వస్తాయి.వచ్చినవి మన ద్వారా చక్కని దివ్యకార్యము (చేయబడుతుంది) నిర్వర్తింపబడుతుంది. అలా జరిగితేనే మానవ జీవిత అర్ధం అని సత్చరిత్ర చెపుతున్నది.


*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

సాయిబాబా దర్శనం


సాయిబాబాను చూడాలనే ఆశతో ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చేవారు. అయితే తమ ఇష్టం వచ్చినట్లు చుట్టు ముట్టేవారు కాదు. ఎవరైనా సరే తమ వంతు వచ్చేవరకు ఆగేవారు. బాబాకు కనుక ఇష్టం లేకుంటే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేసే వారు కాదు. ఒకవేళ వెళ్లాలను కున్నా బాబా దర్శనభాగ్యం కలిగేది కాదు. కనీసం ఆయన నామాన్ని కూడా స్మరించలేక పోయేవారు.

సాయిబాబా మహా సమాధి చెందక ముందు ఆయనను తృప్తిగా దర్శించుకోవాలని వెళ్ళిన ఎందరో భక్తులకు నిరాశే ఎదురైంది. తమ కోరిక తీర లేదని నిరాశగా చెప్పిన భక్తులూ వున్నారు. అదృష్టవంతులకు మాత్రమే బాబా దర్శనభాగ్యం కలిగింది. తనను చూడాలని వచ్చిన కొందరు భక్తులను సాయిబాబా కొన్నాళ్ళు అక్కడే ఉండమనేవారు. ఎవరైనా భక్తులు బాబా వద్దు అంటున్నా వినకుండా బయలుదేరితే, మళ్ళీ వెనక్కి రావలసి వచ్చేది.

అలాంటి అనుభవాలు ఎదురూ అయ్యాక ఆయన సమ్మతిస్తేనే వెనక్కు వెళ్ళేవారు.ఇంకొందరిని పూర్తిగా షిరిడీలోనే స్థిరపడ మని చెప్పేవారు. మరికొందరు అక్కడికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక పోయే వారు. ఇప్పుడు సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన అనుమతి ఉంటేనే షిరిడీ వెళ్ళగలరు. బాబా ఆజ్ఞ ఉంటేనే షిరిడీలో అడుగు పెట్టగలుగుతారు.
సాయిబాబాను దర్శించు కోవాలంటే ముందుగా ఆయన దయ మనమీద ప్రసరించాలి అన్నమాట.

*ఓంసాయిరాం*

*"మౌనమే భూషణమై...శాంతియే అలంకారమై*"..!!

మహాత్ముల జీవితాల్లోనూ మార్పు అనేది ఉంటుంది. ఏదో సందర్భంలో అది మెరుపులా మెరుస్తుంది. అదే వారి జీవితాలను ధాన్యం చేసే మలుపు తిప్పుతుంది. బాబా జీవితం లోనూ అలాంటి మెరుపును మనం చూడ వచ్చు. షిర్డీ కుస్తీ పోటీలకు పుట్టినిల్లు. షిర్డీ చేరిన కొత్తలో బాబా స్వయంగా కుస్తీలు పట్టేవారు. పలువురితో పోటీకి దిగేవారు.

తాను దగ్గరుండి కొన్నిసార్లు కుస్తీ పోటీలు నిర్వహించే వారు. గెలిచిన వారికి బహుమతు లను ఇచ్చి ప్రోత్సహించేవారు. యవ్వనంలో ఉండగా బాబా వేషధారణ కూడా వస్తాది మాదిరిగా ఉండేది. పహిల్వాన్ లా కనిపించే వారు. ఒకసారి మొహియిద్దీన్ తంబోళి అనే వస్తాదుకు, బాబాకు మధ్య ఏదో విషయంలో మాట పట్టింపు వచ్చింది. ఇద్దరూ కుస్తీకి దిగారు. ఆ పందెంలో బాబా ఓడిపోయారు.

ఆ ఓటమి బాబాలో "విరక్తి" కలిగించింది. అన్నిటిపై ఆసక్తిని పోగొట్టింది. అప్పటి నుంచి బాబా వేషధారణ మారింది. ఫకీర్లు ధరించే లంగోటీని బిగించుకుని, పొడవాటి చొక్కా (కఫ్నీ) తొడుక్కునే వారు. నెత్తిన గుడ్డ చుట్టు కునేవారు. చింకి గుడ్డలతోనే సంతుష్టి చెందే వారు. చిరిగిన గోనె ముక్కపైనే కూర్చునేవారు. రాజ్యభోగం కంటే దరిద్రమే మేలనేవారు.

పేదలకు, సాధనాపరులకు భగవంతుడు స్నేహితుడనే వారు. ఆత్మానుసందానంలో మునిగిపోయేవారు. మౌనమే భూషణమై, శాంతికి పెన్నిదిలా కనిపించేవారు. ఎవరైనా ఏదైనా అడిగినా మితంగా సమాధానం చెప్పే వారు. రాత్రి వేళ్లలో మసీదులోనే పడుకునే వారు. పొగ పీల్చుకునే చిలుం గొట్టం, కొంత పొగాకు, రేకు డబ్బా (తంబిరేలు), కఫ్నీ, తల గుడ్డ, చేతిలో శటకా (చిన్న చేతికర్ర) ఇవే బాబా ఆస్తులు.

తలపై గుడ్డను చుట్టి దాని అంచులను చక్కగా జడ మాదిరిగా మెలిపెట్టి ముడివేసే వారు. దానిని ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడేలా వేసుకునే వారు. రోజుల తరబడి దుస్తులు మార్చేవారు కాదు. మసీదులో ఈశాన్యభాగంలో ధునికి ఎదురుగా ఒక కోయ్యపై చేతిని ఆనించుకుని దక్షిణాభి ముఖంగా కూర్చునే వారు.

ధునిలో అహంకారం, కోరికల్ని ఆహుతి చేసే వారు.భక్తుల పాపాల్ని,కర్మల్ని కూడా కట్టెలుగా మర్చి కాల్చేసే వారు.నిత్యం *అల్లా మాలిక్* (భగవంతుడే యజమాని) అని అంటుండే వారు అప్పుడప్పుడు బాబా కాళ్ళకు గజ్జెలు కట్టి మిక్కిలి సొగసుగా నాట్యంచేసే వారు. భక్తి పూర్వకంగా రాగయుక్తంగా పాటలు పాడే వారు.

బాబా నేత్ర, కర, పాద, కదలికలు లయ బద్ధంగా ఉండేవి. మధ్యాహ్న వేల నాలుగైదు ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు. బాబాకు ఆహార పదార్థాలపై రుచి ఉండేది కాదు. అన్ని పదార్థాలను కలుపుకుని తినేవారు.తినగా మిగిలింది మసీదులోని ఓ పాత్రలో ఉంచే వారు. ఇదే సాయిజీవన విధానం. ఎవరు నేర్చుకోవాల్సింది వారు దీని నుంచి నేర్చు కోవచ్చు.

జీవితం నూతి లాంటిది. కోరికలు, సుఖాల వంటి విషవలయంతో అది నిండి ఉంటుంది.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారు సాధన అనే నిచ్చెన సాయంతో పైకి చేరాలును కుంటారు. అయితే అజ్ఞానమనే "మాయ" లో పడిన వారిని కోరికలు కాళ్లుపట్టి కిందికి లాగేస్తుంటాయి. వాటిని జయించిన వారు సాయిపథాన్ని చేరుకుంటారు.

Source :- www.teluguone.com

చిన్నగా .... సరదా గా సద్గురు సాయిబాబా చేయు ఆటను ఒక్కసారి సత్సంగం లా తెలుసుకుందాము..


ఒక్క బాబా భక్తురాలు రొట్టెలు చేస్తూ చేస్తూ *‘ఓంసాయి శ్రీ సాయి జయ జయ సాయి’* అని జపం చేస్తున్నది. ఆవిడ విడిగా పూజ చేయడానికి సమయం కుదరదు పాపం. అందువల్ల పని చేస్తూ చేస్తూ సాయి నామాన్ని చేసుకునేది.
ఇంతలో ఒక్కసారిగా ధమ్మని గట్టిగా పెద్ద శబ్దం వచ్చి బాధతో కూడిన అరుపు వినిపించింది. ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగున వెళ్లి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది.. ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు. గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది. కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు. ఏడ్చి మాత్రం ఎవరిని పిలవ గలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా. పరుగున కిందకు వెళ్ళి చూసింది. బాబు సగం స్పృహలో “అమ్మ అమ్మ” అని కలవరిస్తున్నాడు. ఆమె లోపల మమత కళ్ళలో నుండి జారి తన అస్తిత్వాన్ని ఆమెకు తెలియ చెప్పించింది.
పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీథిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది. బాబా ని ఆసుపత్రికి తీసుకొని వెళుతూ దారిలో అంతా మనసులో సాయిబాబాను తిట్టుకో సాగింది.
“ఓ సాయిదేవా! నీకు ఏమి అన్యాయం చేశాను? నా పిల్లవాడికి ఇంత గతి పట్టిస్తావా?” అని కోపంతో తిడుతూనే ఉంది. సరే, అక్కడ డాక్టర్ ను కలిసి బాబు కి చికిత్స సమయానికి అందింది. బాబు పూర్తిగా నయమైపోయాడు. దెబ్బలు అంతగా ఏమి తగలలేదు. అందువల్ల ఎక్కువ ఇబ్బంది కలగలేదు...... 2రోజులలో ఇంకా ఏమి ఉండదు అని డాక్టర్ చెప్పి పంపించేసారు.

రాత్రికి ఇంటిదగ్గర అందరూ టీవీ చూస్తున్నారు. అప్పుడు సాయిభక్తురాలి మనస్సు జరిగినది అంతా తలచుకొని ఒక్క ఆలోచనలో ఉంది . సాయిబాబా అంటేనే విరక్తి కలగసాగింది. ఒక తల్లి మమత సద్గురు దేవుడు ఉనికిని ఎదిరిస్తోంది(అందకుండా దూరం చేస్తుంది). ఆమె బుర్రలో ఆరోజు జరిగిన ఘటనాక్రమం అంతా చక్రంలాగా తిరగింది.
బాబు ఇంటిముందు ఎట్లా కిందపడ్డాడో- తలుచుకుంటే అంతరాత్మ కంపించింది. నిన్ననే పాత మోటరు పైపు ప్రాంగణం నుండి తీయించివేశారు. సరిగ్గా అదే స్థలంలో బాబు కిందపడ్డాడు. ఒకవేళ నిన్న మేస్త్రీ రాకపోయి ఉంటే? ఆమె చేయి ఒక్కసారి తన పొట్ట దగ్గర పెట్టుకుంది. ఇంకా ఆ చోట కుట్లు పచ్చిగానే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. ఆమె 20-22 కిలోల బాబును ఎట్లా అరకిలోమీటరు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. బాబు పువ్వు లాగా తేలికగా అనిపించాడప్పుడు. ఆమె బట్టల బకెట్ పట్టుకుని మేడ మీదకు తీసుకొని వెళ్ళలేక పోతుండేది మామూలుగా అయితే.!.
మళ్ళీ ఆమెకు గుర్తుకు వచ్చింది- డాక్టర్ గారు రోజూ రెండు గంటల వరకే ఉంటాడు. ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు మూడు గంటలు అయింది. ఆమె వెళ్ళంగానే చికిత్స జరిగింది. ఎవరో ఆయనను ఆపి పెట్టినట్టుగా ఆయన ఉన్నాడక్కడ.....

అప్పుడు ఆమె శ్రీ సాయిబాబా చరణాలపై ఆమె తల శ్రద్ధగా వాల్చింది. ఆమెకు ఇప్పుడు మొత్తం ఆట అంతా అర్థమయింది. మనస్సులోనే ఆ శ్రీ సాయిపరమాత్ముని తన తప్పుడు మాటలకు క్షమాపణ కోరింది.

టీవీలో ప్రవచనం వస్తున్నది-

*భగవంతుడు ఇట్లా అంటాడు- “నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను.* *కానీ నీకు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను.* *నీ దారిని సరళంగా చేయగలను.* *కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు.* *అంతే”*
*అప్పుడు ఆ భక్తురాలు ఇంట్లో దేవ మందిరం వైపు చూసింది- సద్గురు సాయిబాబా వారు ఆమె చూస్తున్న ఫొటోలో నవ్వుతూ కనిపించినట్లు అనిపించింది.*

మనం అందరం కూడా ఆయన పిల్లలం అందుకు మనము కూడా ఓర్పు,సహనం తో ఒక్కసారి ఎదురు చూసి ఆలోచిద్దాం....... మన వెనుక ఉండి ఆయన చేసిన లీలలు చూదాం.....మనసున నిలుపుకొని మనసారా....సాయి నామాన్ని చేద్దాం.....

*_నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

*_అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార