అమృత వాక్కులు

1. ధనాన్ని ఎవరైనా కూడబెట్ట గలరు, ధర్మాన్ని కూడబెట్టిన వారే మహనీయులు ధర్మాత్ములు.
2. ఎదుటి వారు అర్హులా కాదా ఆన్న విషయం పక్కన బెట్టి వారిని గౌరవించడంలోనే నీ ఔన్నత్యం తెలుస్తుంది.
3. ఆత్మ విచారణ శాంతినిస్తుంది, లోక విచారణ అశాంతినిస్తుంది.
4. మనిషికి అనుమానం ఎక్కువైతే వివేకం నశిస్తుంది.
5. పరమేశ్వరుడు సకల భారాలను భరిస్తున్నాడు కానీ, నీవు "నేను" భరిస్తున్నాననుకుంటున్నావు. నీ భాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు.నీవల్ల ఏ పని ఏ సమయంలో జరుగవలసి ఉన్నదో ఆ పని ఆసమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు.నీవు చేయ వలసిందల్లా ఫలితమాశించకుండా సత్కర్మలు చేయడమే.
*:--Dr Vivek Jilla*

ఈ రోజు సాయి మాట
సాయితో మనం
అమృత వాక్కులు
శ్రి సాయి సచ్చరిత్రము- పారాయణ ఆడియో
శ్రీ సాయి వీడియోలు
సాయి పలుకులు
సాయి వచనాలు
షిరిడి సమాచారము

*శరీరం రథం..ఆత్మ దాని యజమాని..బుద్ధి ఆ రథాన్ని నడిపే సారధి..మనసు కళ్లెం..కోరికలు గుర్రాలు..ఎవరికి గ్రహించే శక్తి ఉండదో,ఎవరు కోరికలు వారి స్వాధీనంలో వుండవో అతడు గమ్యాన్ని చెరలేడు...చావు-పుట్టుకలనే చక్రంలో పడి కొట్టిమిట్టాడుతాడు...తన వివేచన శక్తి (బుద్ధి) తో మంచిచెడులను ఎంచుకొని ఎవరైతే కళ్ళాన్ని (మనసు) లాగి పట్టుకోగలరో వారు తమ గమ్యాన్ని సులభంగా చేరగలరు...*

జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే బాబా పలికిన ఈ పలుకులను అనుక్షణం గుర్తు0చుకోవాలి...

సాయిరామా!!!

ధనము, కీర్తి, గెలుపు వీటి వెంట మనసు పరుగులు పెడుతుంది.ఏదీ శాశ్వతం కాదు.జీవితంలో ఇవన్నీ వస్తూ,పోతూ ఉంటాయి.భక్తితో కూడిన ప్రేమ మాత్రమే శాశ్వత ఆనందం కలిగిస్థుంది.దూరాలోచనలను దూరం చేస్తుంది.సహనాన్ని అలవరచుకునేలా చేస్తుంది.సాయి మీ లీలలనే ప్రతి నిత్యం స్మరించిన చాలు సంతృప్తి అనే సంపదను సొంతం చేసుకోగలము.... ఓంసాయి!!శ్రీ సాయి!!జయ జయ సాయి

మనకు దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు,
జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో,
భవిష్యత్తులో నిన్ను ఒద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకుని బతుకుతారు.
మాటలను నీళ్ళను పారబోయటం తేలికే,
తిరిగి వెనక్కి తీసుకోవటమే *కష్టం* అందుకే మాటల విషయంలో *ఆచి తూచి* మాట్లాడాలి మిత్రమా,
ఈ లోకం ఎప్పుడైనా సరే *మంచివాడ్ని* ఎప్పుడు మంచివాడు అని అనదు,
మంచివాడిగా నటించేవాడినీ మాత్రమే *వీడు చాలా మంచివాడు* అని అంటుంది,
మంచతనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు.
పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు
*కానీ!*
అహంకారం తో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని *బాగు* చెయ్యలేం వాళ్ళని *కాలమే* మార్చాలి...
*:rose:మీ...వివేక్ జిల్లా*

నేను బాబాను చూసినప్పుడల్లా *ఆయన దృష్టి నాకు ఎలా ఉంటుందంటే, అప్పుడే పుట్టిన బిడ్డను కన్నతల్లి ప్రప్రథమంగా ఎంత అపురూపంగా చూసుకుంటుందో అలా అనిపిస్తుంది.* ఆ చూపు ఎలా వుంటుందో చెప్పడానికి, వర్ణించడానికి ఇంతకుమించి ఉపమానం లేదనిపిస్తుంది. ఊహించి చూడండి! అప్పటివరకు ఆ బిడ్డ తల్లి శరీరంలో ఒక భాగంగా ఆమెతో కలసివుంది, కానీ ఇప్పుడు తల్లి శరీరం నుండి విడివడి వేరొక ఉనికిని సంతరించుకుంది. ఆ బిడ్డకు తాను వేరుగా అనిపిస్తుంది కానీ, తల్లికి కొంతకాలమైనా ఆ బిడ్డ తన శరీరమని, తనలోని అంతర్భాగమనే భావన ఉంటుంది. అందుకే నేను "తొలిసారి చూసుకున్నప్పుడు" అని చెప్పాను. బాబా చూపులో నాకు కనిపించేది అదే భావం. *సద్గురువు సమస్త సృష్టిని తనలోని భాగంగానే ప్రేమిస్తాడు*. ప్రాపంచికంగా చూస్తే తల్లి విషయంలో ఈ అనుభవం కొంతకాలం మాత్రమే ఉంటుంది. బిడ్డ పెరుగుతూ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకునేకొద్దీ తల్లికి ఆ బిడ్డ తనలోని భాగమే అన్న భావన సన్నగిల్లుతుంది. *కానీ సద్గురువుకు మాత్రం ఆ ప్రథామానుభూతి నిరంతరం ఉంటుంది. ఎప్పటికీ మారదు.*

సాయిరామా!!!

నియమములు లేవు, నియంత్రణ అవసరం లేదు, నిర్మలమైన మనసు చాలు...సాయి నిన్ను ధ్యానించుటకు...భక్తుల మది భగవంతుని గుడి...ఇంద్రియములే పూజా ద్రవ్యములు...మనస్సు , బుద్ధి ఏకాగ్రము చేసి తదేకముగా నిన్నే స్మరించటమే మేము చేసే అర్చన...సాయి మీ అభిమతమే మాకు ఆదర్శంగా ఉండేలా , అనుభవాలు కలిగించే నిత్యచైతన్య స్వభావ...శ్రీ సాయి............

ఓంసాయి! శ్రీ సాయి! జయ జయ సాయి!

సాయిరామా!!!

వసంతం కోసం వృక్షాల ఎదురుచూపు , మండుటెండకు పొడిబారిన ధరిత్రి వానచినుకుకై ఎదురుచూపు, మసకబారిన మనసు స్వాంతనకై ఎదురుచూపు, స్మరణమే శరణమనుకున్న మేము మీ దయాదృష్టికై ఎదురుచూపు , సాయి ఎదురుచూపులోని ఆంతర్యం అలసిన ఆశకు ఊపిరి పొస్థుంధి...మీ కృపకై ఎదురుచూస్తూ, స్మరిస్థూ ఉన్న చాలు సత్యమే సర్వస్వమవుతుంది.....

ఓంసాయి! శ్రీ సాయి!జయ జయ సాయి!

సాయిరామా!!! బంధాల వడిలో బందీలను చేసి, భాద్యతల నడుమ జీవితాన్ని ఉంచి, జగన్నాటకమనే మాయలో ఆటబొమ్మలమై ఉన్నాము సాయి....జీవితపు విలువలు తెలిపి జ్ఞానాన్ని మేల్కొలిపి మాయ అనే చీకటి నుండి తప్పించి ఉషోదయవెలుగు రేఖలమై ప్రకాశించేలా సూర్యబానుడివై ఉదయించండి సాయి...మాపై కరుణను కురిపింపించండి సాయి.....

ఓంసాయి! శ్రీ సాయి!జయ జయ సాయి

శ్రీ సాయిశ్వరా!

నేను నిన్ను సేవించుచుండగా, నాకు కష్టాలే రానీ, సుఖాలే రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అగును . నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపించును. కొన్ని జన్మలు మాయని నిజముగా భావించి సత్యాన్ని విడుచును అటువంటి వారిని ఎం చేస్తవొ.......

సాయిరామా!!!

దూషణ, ద్వేషము ఎరుగరు సాయి సదా నిన్నే సర్వమనుకున్నవారు...సాయి నిజముగా నిన్ను మరువనివారి సందేహాలను అడగకముందే నివృతి చేసే మా సాయిరామా, సర్వకాల సర్వావస్తలందు శ్రద్ద, సబూరి కలిగిఉండడమే మీ పట్ల నిజమైన భక్తి , ప్రేమ చూపించడం.......

ఓంసాయి! శ్రీ సాయి! జయ జయ సాయి!

*సద్గురు సాయి నిత్య ప్రార్ధన*

నిత్య ప్రార్ధన
ఒ!పరమాత్మా! సాయి మహాదేవా!శుధ్ధ అనంత శక్తి స్వరూపా!జ్ఞాన స్వరూపా!ప్రేమమయ మూర్తీ!జ్యొతి స్వరూపా! దేవాధి దేవా!పరమ కృపా సాగరా!నమస్కారం.

మళ్ళీ మళ్ళీ నమస్కారం.
ఓ!విశ్వ స్వరూపా! విశ్వాతీతా!అద్వితీయ పరమేశ్వరా !నన్ను నీవాణ్ణీ చేసుకో!పూర్తిగా నీవాణ్ణీ చేసుకో!నన్ను రక్షించు సాయి ప్రభూ!నేను నీవాడిని!నాతప్పు,ఒప్పులతో నీ శరణాగతి వేడుకొంటున్నాను.

ఓ!సాయీశ్వరా! నా శరీరం ఆరోగ్యంగా వుండాలి.నా సర్వేంద్రియాలు పవిత్రం గా వుండాలి.నా బుధ్ధి సుస్థిరంగా వుండాలి.నాభావాలు పవిత్రం గా వుండాలి.

ఓ!సాయి ప్రభూ!నా జీవితం వికసించి,మీ సేవలొ,మీ భజనలో.మీ స్మరణలో,మీ చింతనలో గడిచిపోవుగాక!పరమ దయామయా!మిమ్మల్ని దర్శించేలా,సత్యాన్ని పాటించేలా దీవించు.

ఓ!శిరిడీ పూర్ణ స్వరూపా!నా అసంపూర్ణత్వాన్ని పూర్ణత్వంలోకి మార్చు.నన్ను నీలో చేర్చుకుని, పరి పూర్ణుడిని చేయి.అందరూ సద్గతిని పొందాలి.అందరూ సుఖంగా వుండాలి.అందరూ ప్రేమగా వుండాలి.అందరి జీవితాలు కల్యాణ ప్రధమవ్వాలి.

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

1. నిద్రపోవు సమయమున సాయిని తలుచుకొని, ఆరోజు చేసిన తప్పులకుపశ్చాత్తాపము పొందుము. తిరిగి ఆ తప్పులు చేయకుండునట్లు సాయిని ప్రార్థించుము.

2. తృప్తి, శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలతో ఉండు వారు శ్రీ శిరిడిసాయి కృపకు పాత్రులు అగుదురు.

3. కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు.

4. జీవితం నీటి బుడగ, కావున ఉన్నత లక్ష్యాన్ని దీక్షతో సాధించు.

5. పనులు అనుకూలంగా జరిగినప్పుడు మన గొప్పతనం అనుకోవడం, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇతరులను నిందించడం, దైవాన్ని దూషించడం మంచిది కాదు.

6.మిమ్మల్ని మరిపించే సుఖాలు వద్దు మిమ్మల్ని మరిపించే దు:ఖాలు వద్దు చివరి శ్వాసవరకు మీ పైన నమ్మకాన్ని సడలనివ్వక మమ్ములను ఉత్తమ మైన మార్గంలో నడిపించండి.

7.మాలోని దురాశను దూరం చేయండి మాలోని మిగిలిన పాపకర్మలు బస్మీపటలమై పోయేలా చేయండి.

8.ఇకనుండి నా సర్వ బాధ్యతలు నీవే బాబా నీ పాదాలకు మ్రొక్కాటం నేను ఎన్నడు మరువనీయక తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను చేసిన ఆపరాధములన్నింటిని క్షమించి నన్ను అనుగ్రహించు. నా ప్రార్థనను మన్నించు బాబా.


`నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను.

ఏ సాధనలుగాని ఆరు శాస్త్రములలో ప్రావీణ్యముగాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము నుంచుము.

గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహరబ్రహ్మల (త్రిమూర్తుల) అవతారమని యెంచెదరో వారే ధన్యులు."
``
*_ఓం శ్రీ సాయి నాథయా నమః_*
*_ఓం శ్రీ సద్గురు సాయినాథయా నమః_*
*_అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై_*

*_ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి_*

*_నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ దుఃఖ అవస్థ రక్షకరం_*

సాయి మార్గంలో నడిచే వారు తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి వారికి సామాన్యంగా, సహజంగా మనోనాశనం అవుతుంది.
శరీరం యొక్క చావు పుట్టుకలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. శరీరాన్ని ఏమీ పట్టించుకోరు. దానికి ఏదైనా రోగం వస్తే వైద్యం చేయించుకోవడం. లోపల మీ జీవుడిని బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చే కష్ట సుఖాలకు మీ మనస్సే కారణం.
చనిపోయాకా ఇతర లోకాలకు ప్రయాణం చేసేది మనస్సే ( జీవుడే ). కొత్త శరీరాన్ని తొడుక్కొనేది జీవుడే. మీరు ఏదిగా ఉన్నారో, ఆ సద్వస్తువు ప్రయాణం అంటే (మన శరీరం ప్రయాణం) చెయ్యదు.
ముందుగా మనస్సును అంటే, జీవుడిని బాగు చేసుకోండి. జీవ లక్షణాలను పోగొట్టుకోవాలి,
అదే నిజమైన సంపద. జీవుడిని బాగు చేసుకోవటం ఎలాగ ? దానికి సంబంధించిన సాధన, మెలుకువలు చెప్పిన గ్రంథం శ్రీ సాయి సత్చరిత్ర.
మనకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉండాలి. అజ్ఞాని ఇంద్రియాలు చెప్పినట్లుగా వినాలి. అలా వినకపోతే అవి ఊరుకోవు. జ్ఞాని చెప్పినట్లుగా ఇంద్రియాలు ఉంటాయి. అదీ అజ్ఞానికీ, జ్ఞానికీ ఉన్న తేడా.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార